కరోనాకు భయపడకుండా జాన్ వద్దకు వెళ్లిన అరవింద

0

ప్రభాస్ జాన్ అలియాస్ ఓ డియర్ చిత్రం ప్రస్తుతం యూరప్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ జరగడం లేదు అంటూ మీడియా లో వార్తలు వచ్చాయి. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ లో ఒక భారీ చేజింగ్ సీన్ ను అంతర్జాతీయ టెక్నీషియన్స్ తో తెరకెక్కించాం. యూరప్ లో ఇంకా షూటింగ్ చేయబోతున్నాం అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్ తో షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు తాజాగా పూజా హెగ్డే జార్జియా వెళ్లింది.

జార్జియా వెళ్లే ముందు సోషల్ మీడియాలో ఈ అమ్మడు ట్వీట్ చేసింది. నేను రేపు జార్జియా వెళ్లబోతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి తాను బయటకు వెళ్తున్నట్లుగా అర్థం వచ్చేలా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కరోనా వైరస్ భయంతో ఊరు కాదు ఇల్లు దాటేందుకే జనాలు భయపడుతున్న ఈ సమయంలో ఈ అమ్మడు మాత్రం జార్జియా దేశంకు వెళ్లింది.

ఇప్పటి వరకు వందకు పైగా దేశాల్లో కరోనా బాధితులు నమోదు అయినా జార్జియా దేశం లో మాత్రం కరోనా వ్యాప్తి లేదు. అందుకే అక్కడ సేఫ్ గా జనజీవనం కొనసాగుతుంది. ఓ డియర్ చిత్రం షూటింగ్ కూడా నిరాటంకంగా సాగిస్తున్నారు. అల వైకుంఠపురం లో చిత్రం తర్వాత పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంతో ఈ ఏడాది పూజా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-