పూజా వర్సెస్ సామ్ ఎంతవరకూ..?

0

ఇద్దరు అందగత్తెల మధ్య ఈగోలు మనస్ఫర్థలు పర్యవసానంగా క్యాట్ ఫైట్లు చాలా కామన్. ఇలాంటివి బాలీవుడ్ నాయికల మధ్య చాలా సార్లు బయటపడ్డాయి. ఇటు సౌత్ లోనూ అగ్ర కథానాయికలు త్రిష.. నయనతార.. సమంత.. శ్రుతిహాసన్ ఇతర నాయికల విషయంలో అరుదుగా బయటపడిన సందర్భాలున్నాయి. ఒకరి అవకాశం ఇంకొకరు చేజిక్కించుకున్న క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చడం.. ఫైర్ అవ్వడం చూసినవే.

తాజాగా పూజాహెగ్డే – సమంత మధ్య క్యాట్ ఫైట్ గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత పని అయ్యింది. అందుకు సోషల్ మీడియా వార్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికే వైరల్ అయిన సోషల్ మీడియాల స్క్రీన్ షాట్లను పరిశీలిస్తే.. పూజా చేసిన ఓ కామెంట్ సమంతను తీవ్రంగా హర్ట్ చేసింది. అందుకు కౌంటర్ గా సమంత స్నేహితులు ఆన్ లైన్ లోకి వచ్చి పూజాపై విరుచుకుపడ్డారు. ఇంతకీ పూజా ఏమని కామెంట్ పెట్టింది? అంటే.. సమంత ఏమంత అందంగా లేదు!! అంటూ ఇన్ స్టాలో కామెంట్ చేసింది. అది కూడా తాను టీవీలో మజిలీ సినిమా చూస్తూ ఈ కామెంట్ పెట్టిందిట. ఇంకేం ఉంది? ఆ వ్యాఖ్య సమంత అభిమానుల్ని తీవ్రంగా హర్ట్ చేసింది. పూజా సారీ చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అయితే అందుకు సమాధానం ఇస్తూ తన ఇన్ స్టాగ్రమ్ హ్యాక్ కి గురయ్యిందని అవేవీ నమ్మొద్దని పూజా కోరింది.

కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పూజాకి.. సమంతకు మధ్య మాటా మాటా పట్టింపు ఏదో వచ్చిందని ఈగో సమస్యలు తలెత్తాయని.. అందుకే ఈ వార్ జరుగుతోందని అంతా భావించారు. అది నిజమే అనుకునేలా ఆ తర్వాత సమంత స్నేహితురాళ్లు నందిని రెడ్డి.. చిన్మయి వకాల్తా పుచ్చుకుని మరీ పూజాపై ఎటాక్ చేశారు.

“వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ“ అంటూ నందిని రెడ్డి ట్వీట్ చేశారు. ఇది ఒక రకంగా పూజాకి కౌంటరేనన్న చర్చ సాగింది. “ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్“ అంటూ చిన్మయి పంపిన సందేశం కూడా అనుమానాన్ని రెట్టింపు చేసింది. అయితే వీటన్నిటికీ సమాధానంగా “జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్“ అంటూ సమంత పంచ్ వేయడంతో నిజంగానే పూజాతో డిఫరెన్సెస్ తలెత్తాయని భావించాల్సి వచ్చింది.

గంపగుత్తగా ఇలా స్నేహితురాళ్ల గుంపు పూజా పై పడడం వెనక కారణం ఏమై ఉంటుంది? అంటూ ప్రస్తుతం ఆరాలు మొదలయ్యాయి. బహుశా అక్కినేని హీరోల సినిమాలు ఒక లైలా కోసం (చైతన్య).. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (అఖిల్ )లో పూజా నటనపై సామ్ ఏదైనా కామెంట్ చేసిందా? ఇన్ సైడ్ టాక్ ఏమై ఉంటుంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్లకు ఫుల్ స్టాప్ పడాలంటే పూజా కానీ.. సామ్ కానీ లైన్ లోకి రావాల్సిందే.
Please Read Disclaimer