తెలుగమ్మాయి హొయలు..రెప్ప వేస్తే ఒట్టు!

0

తెలుగమ్మాయిలు ఎందుకు తగ్గిపోయారో అర్థం కావడం లేదంటూ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దూరపు కొండలు నునుపు అనాలో.. లేక తెలుగోళ్లకు తెలుగు ట్యాలెంట్ కనిపించదు అని సరిపెట్టుకోవాలో! కానీ తెలుగు బామలకు అవకాశాలు అంతంత మాత్రమే. ముంబై క్యాట్ వాక్ భామలకే ముచ్చెమటలు పట్టించే అందగత్తెలు మనకు ఉన్నా ఎందుకనో తెలుగు సినీ పరిశ్రమ చిన్న చూపు చూస్తూనే ఉంది. తెలుగు అందాలకు ఏం తక్కువని మన దర్శకనిర్మాతలు అవకాశాలివ్వరో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిపై నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది.

ఇటీవల సైలెంటుగా దూసుకొచ్చిన తెలుగందం పూజిత పొన్నాడ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం చక్కని తెలివితేటలు అభినయం అన్నిటి కలగలుపుతో ఈ భామ భారీగానే అభిమానుల్ని సంపాదించుకుంది. `రంగస్థలం` చిత్రంలో చక్కని అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కెరియర్ పరంగా దూసుకుపోతోంది. లఘు చిత్రాలతో మొదలై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది. హవీష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `7`లో ఆరుగురు నాయికల్లో ఒక కథానాయికగా నటించింది. ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. తెలుగమ్మాయి అయినా చెన్నయ్ లో స్టడీ పూర్తి చేసిన పూజిత తమిళం చక్కగా మాట్లాడుతుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత లఘు చిత్రాల్లో నటించింది. అలా ఓ లఘు చిత్రంలో చూసి సుకుమార్ `రంగస్థలం` చిత్రంలో అవకాశం ఇచ్చారు. అందులో ఆది భార్య పాత్రలో నటించింది.

లిప్ లాక్ లు.. ఎక్స్ పోజింగుకి వెరువని ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరో కొత్త ఫోటో షూట్ తో అదరగొట్టేసింది. బ్లాక్ ఫ్రాకులో ఈ అమ్మడి అందాల ఎలివేషన్ సంథింగ్ స్పైసీ అనే చెప్పాలి. అంతగా ఎక్స్ పోజ్ చేస్తున్నట్టు కనిపించినా అందులో ఏమేరకు ఎలివేట్ చేయాలో అంతవరకూ అందాల్ని ఓపెనప్ అయ్యింది. అన్నిటినీ మించి ఆ థై స్లిట్ లుక్ తో అగ్గి రాజేసింది. ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పూజిత చెబుతోంది. పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Please Read Disclaimer