తెలుగమ్మాయ్ తడాకా చూపించిందిగా!

0

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల వెల్లువపై నిరంతరం ఒక క్వశ్చన్ మార్క్ ఎదురవుతోంది. అసలు తెలుగమ్మాయిలు ఎందుకు తగ్గిపోతున్నారు? ఇక్కడ కావాల్సినంత ప్రతిభ ఉండీ ఎందుకు వెనకబడిపోతున్నారు? అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. విజయశాంతి.. జయసుధ లాంటి సీనియర్ నటీమణులు అసలు తెలుగమ్మాయిలు ఏమైపోయారు? అన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

అయితే రంగుల ప్రపంచంలో తెలుగమ్మాయిల ఎగ్జిస్టెన్సీ కుదరని పని అని ప్రూవైంది. అయినా ఎన్నో ప్రతికూలతల నడుమ ఇక్కడ కొందరు భామలు కథానాయికలుగా ఎదిగేందుకు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. రేస్ లో ఇటీవల పలువురు భామలు కనుమరుగైనా.. కొందరు కొత్త భామలు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ నేపథ్యం నుంచి వచ్చిన అందగత్తె పూజిత పొన్నాడ టాలీవుడ్ లో వరుసగా పలు క్రేజీ అవకాశాల్ని అందుకుంటోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రలో నటించిన పూజిత ప్రస్తుతం వరుసగా అవకాశాల్ని అందుకుంది. ఆ క్రమంలోనే నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పూజిత లేటెస్ట్ ఫోటోషూట్లు యువతరంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోషూట్లలో పూజిత అందాల ఎలివేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. అందాన్ని ఎంతవరకూ ఆవిష్కరించాలి… ఎంతవరకూ దాచి పెట్టాలి అన్న ఫార్ములాని పక్కాగా అనుసరిస్తోంది. తాజాగా రివీల్ చేసిన కొత్త ఫోటోలో పూజిత అల్ట్రా స్మార్ట్ లుక్ తో కనిపించింది. పింక్ డిజైనర్ స్లిట్ డ్రెస్ .. దానికి కాంబినేషన్ లిప్ స్టిక్ తో మెరుపులా మెరిసింది. పూజిత థౌ సౌందర్యం అంతకుమించి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
Please Read Disclaimer