ఈసారి బిగ్ బాస్ చాలా హాట్ గురూ!

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు సన్నాహకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు సెలబ్రెటీలు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు. అందులో మొదటగా బిత్తిరి సత్తి ఉండగా ఆ తర్వాత సింగర్ సునీత మరియు యాంకర్ జాన్సి కమెడియన్ తాగుబోతు రమేష్ ల పేర్లు కూడా ఉన్నాయట. ఇదే సమయంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ను గ్లామర్ తో నింపేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా గ్లామర్ ఉండటంతో పాటు వివాదాస్పదం ఉంటేనే షో కు రేటింగ్ వస్తుంది. అందుకే ఎక్కువ మంది ముద్దుగుమ్మలను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూనమ్ భజ్వాతో నిర్వాహకులు చర్చలు జరిపారట. నాగార్జున హీరోగా నటించిన బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా కొంత కాలం నిలిచిన ముద్దుగుమ్మ హంసా నందినిని కూడా ఈ సీజన్ కోసం సంప్రదించారట. వీరిద్దరితో పాటు మరో హాటీ శ్రద్దా దాస్ ను కూడా రంగంలోకి దించాలని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరికి పారితోషికం భారీగా ఇచ్చే అవసరం లేదు. అలాగే వీరికి మంచి క్రేజ్ ఉండటంతో పాటు స్కిన్ షో తో షో ను గ్లామరస్ గా మార్చేస్తారు. ఇక మేల్ కంటెస్టెంట్స్ ఉంటే వారితో లవ్ ట్రాక్ కూడా మొదలు అయ్యే అవకాశాలు లేకపోలేదు. గత సీజన్ లో మాదిరిగా ఒక్క జంట లవ్ ట్రాక్ లో పడ్డా కూడా సీజన్ 4 కు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలను షోలో దించబోతున్నారట. ఇక ఈ సీజన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే హోస్ట్ ఎవరు.. ఎప్పటి నుండి అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.