పూనమ్.. ఓ ఖతర్నాక్ పోజు

0

హీరోయిన్ పూనమ్ బజ్వా పేరు తక్కువమందికే తెలిసి ఉంటుంది..ఎందుకంటే పూనమ్ తెలుగులో నటించిన సినిమాలు తక్కువే. మహా అయితే ఓ ఐదారు ఉంటాయి. 13 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన అక్కినేని నాగార్జున సినిమా ‘బాస్’ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘పరుగు’లో ఒక కీలకపాత్రలో నటించింది. కానీ ఆ సినిమాలు పూనమ్ కు బ్రేక్ ఇవ్వకపోవడంతో టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. రీసెంట్ గా పూనమ్ ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో ఒక పాత్రలో నటించింది.

ఈ జెనరేషన్ హీరోయిన్ల తరహాలోనే ఈ భామకూడా కంటికి కనిపించని నెటిజనులతో ఎవరికీ అర్థం కాని హాటు యుద్ధాన్ని చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటో షూట్లు చేయడం.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం పూనమ్ కు ఫేవరేట్ హాబీ. రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా పూనమ్ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “హలో ఫ్రెండ్స్.. మీరిచ్చే మద్దతుకు ప్రేమకు కృతజ్ఞతలు. ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ కోసం మీరు నన్ను ‘Helo’ యాప్ లో ఫాలో అవ్వండి” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఎఫ్ బీ.. వాట్సాప్ ట్విట్టర్ లు మాత్రమే సోషల్ మీడియా అనుకుంటారు చాలామంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ కూడా చాలా పాపులర్ అయింది. టిక్ టాక్ సంగతి చెప్పనవసరం లేదు. ఈ ‘హలో’ వాడకం కూడా కూడా వేగంగా పెరుగుతోంది. అందుకే చాలామంది హీరోయిన్లు ఈ హలో కు హలో చెప్తున్నారు.

సరే .. ఈ హలోకు బై చెప్పి ఫోటో విషయం మాట్లాడుకుంటే.. పూనమ్ మెంతి రంగు డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ ఒక ఖతర్నాక్ పోజిచ్చింది. బటన్స్ లేకుండా ఫ్రంట్ వేసుకున్న ముడి సెక్సీనెస్ ను పెంచేసింది. మినిమమ్ మేకప్ తో కనిపించిన పూనమ్ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో నెటిజన్లపై మన్మథ బాణాలు వేస్తోంది. సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా ‘కుప్పత్తు రాజా’ అనే తమిళ సినిమాలో నటించింది. ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్లేమీ లేవు.
Please Read Disclaimer