బాస్ హీరోయిన్ .. కానీ ఇన్ వోర్ తో చెలరేగిందిలా..?

0

పూనమ్ బజ్వా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. పంజాబీ కుడి అయినా ఈ అమ్మడి హైదరాబాద్ లింకులు తెలిసినదే. మాలీవుడ్ లో స్థిరపడినా టాలీవుడ్ లో అగ్ర హీరో నాగార్జున సరసన బాస్ లో అవకాశం అందుకుంది. 2005లో వచ్చిన `మొదటి సినిమా` (కూచిపూడి వెంకట్ దర్శకుడు) తో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ` బాస్` చిత్రంతో హిట్టు కొట్టి ఇక్కడే సెటిలవ్వాలనుకుంది. కానీ తాను ఆశించినది ఒకటి.. అయినది ఇంకొకటి. ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగులో అతిధిగా మెరిసింది. దాంతో పాటే పలు పలు తెలుగు చిత్రాలలో నటించింది. కానీ సక్సెస్ దక్కలేదు.

తమిళ్ మలయాళంలోనూ ఆ తర్వాత రంగ ప్రవేశం చేసింది పూనమ్ బజ్వా. 2008లో హరి దర్శకత్వం వహించిన `సేవల్` అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి.. తనవట్టు- కచేరీ అరంభం- ద్రోహి వంటి చిత్రాలలో నటించింది. అటుపై మలయాళంలోకి అడుగు పెట్టింది. అక్కడ మమ్ముట్టి- మోహన్ లాల్ లాంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించింది. రఫీ మెకార్టీన్ దర్శకత్వంలో వచ్చిన చైనా టౌన్ అనే మలయాళ సినిమాలో ఎమిలీ పాత్రను పోషించింది. మోహన్ లాల్- దిలీప్- జయరాం- కావ్య మాధవన్ వంటి స్టార్లతో నటించే అవకాశం అందుకుంది. కానీ ఏదీ కలిసి రాలేదు.

పూనమ్ ముంబై లోని పంజాబీ కుటుంబంలో జన్మించి స్టడీస్ టైమ్ లో మోడలింగ్ లో రాణించి సినీ ఆరంగేట్రం చేసింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాల్లో జోరు చూపిస్తున్న ఈ అమ్మడు అక్కడ వేడెక్కించే ఫోటోలతో ట్రీటిస్తోంది. లేటెస్టుగా ఇదిగో ఇలా వైట్ అండ్ పింక్ ఇన్ వోర్ లో థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ వేడెక్కిస్తున్న ఫోటోని ఇలా షేర్ చేయగానే అలా నెట్ లో వైరల్ గా మారింది. కనీసం ఈ ప్రయత్నం చూసైనా మన దర్శక నిర్మాతలు ఆఫర్ ఇస్తారేమో చూడాలి.