పూనమ్ కౌర్ అందుకే సినిమాలకు సంతకం చేయడంలేదట

0

ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని అంశాలు నటి పూనమ్ కౌర్‌లో ఉన్నాయి. కానీ ఆమె లక్ కలిసి రాలేదు. అందుకే అర కొర సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో కాలం వెళదీస్తు్న్నారు. 2018లో వచ్చిన ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాలో కనిపించిన పూనమ్ ఆ తర్వాత తెలుగులో పూర్తిగా సినిమాలు చేయడం మానేశారు. దాంతో పూనమ్ తనకు ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదా లేకపోతే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అవకాశాలు తగ్గిపోయాయా అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో కలిగాయి. అయితే ఇందుకు కారణమేంటో తాజాగా పూనమ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందట. పిల్లల్ని కని త్వరగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారట. అందుకే సినిమాలకు సంతకం చేయడంలేదని తెలిపారు.

‘నాకు అవకాశాలు వస్తున్నా కూడా నేనే సంతకం చేయడంలేదు. ఎందుకంటే నాకు ఇక పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లల్ని కనాలని ఉంది. నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది’ అని వెల్లడించారు. అదనమాట సంగతి. మరి పూనమ్ కోరిక మేరకు ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నారో. లేకపోతే పూనమ్ మనసులో ఎవరైనా ఉన్నారో ఆమే చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. త్వరలో జరగబోతున్న ప్రతిష్ఠాత్మక కర్తార్‌పూర్ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమం నిమిత్తం పూనమ్ పాకిస్థాన్ వెళ్లబోతోంది. ఈ వేడుకకు హాజరుకావాలని స్వయంగా పాకిస్థాన్ ప్రధాని పూనమ్‌ను ఆహ్వానించారట.

‘కర్తార్‌పూర్ కారిడార్ ఆవిష్కరణకు పాకిస్థాన్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇందుకోసం నేను నా వీసా పనులు చూసుకుంటున్నాను. ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న నిర్ణయం. సిక్కులు గర్వపడే విషయం. నాకు అధికారులు అవకాశం ఇస్తే నేను ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని అనుకుంటున్నాను. 1947లో విభజన అనంతరం దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన మొదటి భారతదేశ సిక్కు మహిళను నేనే’

‘ గతేడాది వెళ్లినప్పుడు నా వీడియో కూడా వైరల్ అయింది. అలా నా గురించి పాక్‌ ప్రధానికి తెలిసింది. అందుకే కారిడర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించారు. ఓ యాత్రికురాలిగా మాత్రమే నేను కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాను. నా ఆలోచనలు, ఉద్దేశం కరెక్ట్ అయినప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. గతేడాది నన్ను ఇరు దేశాల మధ్య శాంతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ పాకిస్థాన్ అవార్డ్ ఇవ్వాలనుకుంది. కానీ ఆ సమయంలో పుల్వామా దాడులు జరుగుతున్నందుకు నేను వెళ్లలేకపోయాను. ఈ విషయంలో ప్రజలు నన్ను టార్గెట్ చేసినా ఫర్వాలేదు. నాకు అలవాటైపోయింది’ అని వెల్లడించారు.
Please Read Disclaimer