ఆ మృగాల్ని చంపి జైలు కెళ్తానన్న పూనమ్

0

డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై మృగాళ్ల హత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటు సెలబ్రిటీలు సహా అటు సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సహా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఉదంతంపై గళం వినిపించారు. నిందితులకు సరైన శిక్ష విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

తాజాగా ఈ ఘటనపై నటి పూనం కౌర్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ జంతువులను చంపి నేను జైలుకెళ్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని గంటల పాటు ప్రియాంకకు నరకం చూపించిన ఆ మృగాలను వదిలి పెట్టకూడదు. ఇలాంటి చీడ పురుగులకు సమాజంలో జీవించే హక్కు లేదు. మళ్లీ ఇలాంటివి జరగకూడదంటే వాళ్లకే పడే శిక్ష సంచలనాత్మకంగా ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా క్రూర మృగాల్లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు- ప్రభుత్వాలు మేల్కొనాలని వ్యాఖ్యానించింది.

అయితే ఆ ఘటనను మరువక ముందే షాద్ నగర్ సమీపంలో మరో మహిళను కూడా గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేసారు. కానీ ఈ ఘటనపై మాత్రం ఏ ఒక్కరూ స్పందించకపోవడం విచారకరం. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. కానీ వాటిపై ఎవరో ఒక పెద్ద వ్యక్తి స్పందిస్తేనో లేక మీడియా హైలైట్ చేస్తేనే స్పందిస్తున్నారు తప్ప లేకపోతే సైలెంట్ గానే ఉంటున్నారు. ఇలాంటి ఘటనలను కొందరు ప్రచారం కోసం వాడుకుంటున్నారన్న ఆవేదనా సెలబ్రిటీల్లో వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer