అతనికి వ్యతిరేకంగా మాట్లాడమని ఆ డైరెక్టర్ నా బ్రెయిన్ వాష్ చేసాడు : పూనమ్

0

టాలీవుడ్ లో సినిమాలతో కంటే వివాదాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ సామాజిక సినీ రాజకీయ అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. అంతేకాకుండా తనపైన నెగిటివ్ కామెంట్స్ చేసే వారిపైన రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇటీవల టాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ వలన నా జీవితం నాశనం అయిందని.. అతని వల్ల డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయని ట్వీట్ చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ మీద వరుస ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచింది పూనమ్.

కాగా రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘పవర్ స్టార్’ అని.. అందులో ఈ సినిమాలో PK MS NB TS తో పాటు ఓ రష్యన్ మహిళ నలుగురు పిల్లలు ఎనిమిది గేదెలు మరియు RGV నటించనున్నారని.. ఆర్జీవీ ‘పవర్ స్టార్’లోని ఈ పాత్రలు ఎవరో అర్థం చేసుకున్నప్పటికీ బహుమతులు ఇవ్వబడవని ట్వీట్ చేసారు. అంతేకాకుండా ‘పవర్ స్టార్’ సినిమాలో లీడ్ రోల్ లో నటించే పవన్ కళ్యాణ్ ని పోలి ఉన్న యాక్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసారు. అయితే ఇప్పుడు వర్మ ట్వీట్ పై పూనమ్ కౌర్ స్పందించి ఈ సినిమాలో ఆర్జీవీ పాత్రని కూడా జత చేయండని కోరింది. ”అమ్మాయిల బలహీనతలు తెలుసుకుని.. వారిని తీవ్ర దూషణలు చేసేలా రెచ్చగొట్టడం.. మళ్లీ ఆ ట్వీట్ల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం లాంటివి చేసే ఆర్జీవీ పాత్రను కూడా పెట్టండి. నేను చిన్నతనంలో మిమ్మల్ని ఎంతో గౌరవించాను.. కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉంది” అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ RGV అనే క్యారెక్టర్ సినిమాలో ఉందని ట్వీట్ చేసారని.. అది చూసుకోకుండా పూనమ్ ఎవరి మీదో అభిమానంతో వర్మపై ట్వీట్స్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే అక్కడితో ఆగని పూనమ్ వరుస ట్వీట్స్ చేసింది. ”ఓ దేశద్రోహి డైరెక్టర్ ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని దాదాపు గంటసేపు నా బ్రెయిన్ వాష్ చేసాడు. తనకు ఆ డైరెక్టర్ పంపిన ఆ ట్వీట్స్ సదరు పార్టీ ప్రతినిధులకు పంపించాను. అతని దురద్దేశాన్ని తనకు కొందరు మీడియా వారు వెల్లడించారు. మీడియాలో కొందరైనా నిజాయితీగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు” అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా ”ఈ వ్యక్తి జియా ఖాన్ మరణం వెనుకున్న దాగి ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి. ఇండస్ట్రీలోని నిజానిజాలు బయట పెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఆమె తల్లి బాధను అర్థం చేసుకున్నారని అనుకుంటాను.. కానీ మీకు వారెవరూ ఫండ్ ఇవ్వరు.. మీకు దానితో ఎలాంటి లాభం ఉండదు.. కాబట్టి మీరు వారిపై సినిమాలు తీయరు” అని పూనమ్ మరో ట్వీట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పూనమ్ ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
Please Read Disclaimer