సెన్షేషనల్ హాట్ స్టార్ ఎంగేజ్డ్

0

బాలీవుడ్ నటిగా.. మోడీల్ గా సోషల్ మీడియాలో సెన్షేషనల్ పోస్ట్ లు షేర్ చేయడం ద్వారా జనాలకు బాగా దగ్గర అయిన ముద్దుగుమ్మ పూనమ్ పాండే గత కొంత కాలంగా సామ్ బాంబెతో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. తమ వ్యవహారంను పూనం గతంలోనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చాలా కాలంగా వీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వీరు పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవలే వీరు రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఫొటోను షేర్ చేసిన సామ్ బాంబె చివరకు మేము పూర్తి చేశాం అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. సామ్ పోస్ట్ కు పూనమ్ కూడా స్పందించింది. బెస్ట్ ఫీలింగ్ అంటూ తన ఆనందంను వ్యక్తం చేసింది. ఇద్దరు కూడా రింగ్స్ చూపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో ఎన్నో వివాదాస్పద వీడియోలు మరియు ఫొటోలతో సెన్షేషన్ అయిన పూనమ్ పాండే గత కొన్నాళ్లుగా మాత్రం సైలెంగ్ గా ఉంటోంది. వివాదాల జోలికి వెళ్లకుండా సెన్షేషన్స్ కు దూరంగా ఉంది.