పూనమ్ పాండే కి చట్టబద్ధత కల్పించారా?

0

బాలీవుడ్ లో కథానాయికగా ఓ వెలుగు వెలగాలని.. స్టార్ డమ్ అందిపుచ్చుకోవాలని కోటి ఆశలతో ముంబై వీధుల్లో అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్లెందరో.. అలా కోటి కోర్కెలతో సినీరంగంలోకి ఎంటరవుతున్న వాళ్లల్లో చాలా మందికి అవాకశాలు రావడం లేదు. కొంత మంది అవకాశాలు రాక పిచ్చి వాళ్లుగా మారుతుంటే మరి కొంత మంది తామే అవకాశాల్ని సృష్టించుకుంటూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ సెలబ్రిటీ పిచ్చి ఒక్కోసారి ప్రకోపించడం .. పక్కదారి పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నమ్ముకున్న సినిమా అక్కున చేర్చుకోలేదని.. విచ్చలవిడితనంతో చెలరేగడం బెంబేలెత్తిస్తోంది. రెగ్యులర్ మీడియాకు సమాంతరంగా ఎదుగుతున్న సోషల్ మీడియా.. యూట్యూబ్ వంటి సాధనాల్ని ఉపయోగించుకుంటూ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఒక రకంగా ఇది బూతు ప్రపంచానికి పరాకాష్టగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమా అవకాశాలు రాక రాంగ్ రూట్ లో వెళుతున్న హాటీ పూనమ్ పాండే సోషల్ మాధ్యమ వ్యాపకాలు తెలిసిందే. హిందీ పరిశ్రమ ఆరంభం ఒకటి రెండు అవకాశాలు వచ్చినా అవి బీగ్రేడ్ సినిమాలు కావడం.. తనని బాలీవుడ్ ఆదరించకపోవడంతో కసి పెంచుకున్న పూనమ్ తన బాడీనే ఆయుధంగా మార్చుకుని బూతు వీడియోలతో చెలరేగిపోవడం మొదలుపెట్టింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన పూనమ్ హద్దులు దాటి అంగాంగ ప్రదర్శన చేస్తూ రెచ్చిపోతోంది. ఇది కేవలం అభిమానుల్ని అలరించేందుకు.. నా హద్దులు నాకు ఉన్నాయి! అంటూనే రెచ్చిపోయి అందాల్ని ఆరబోస్తోంది. పోర్న్ స్టార్లను తలపిస్తోంది కొన్ని యాక్టివిటీస్ లో.

నాటీ నైబర్.. బీచ్ బమ్.. డట్నీ దేవిక వంటి డర్టీ వీడియోలతో పూనమ్ తన ఛానల్ కు ఫాలోయింగ్ పెంచుకుంది. ఒక రకంగా న్యూడ్ వీడియోలతో యువతకు పూనకం తెప్పిస్తోంది. ఇన్ స్టాలో ఆమె వీడియోలని ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో వుండటం గమనార్హం. అయితే ఇలాంటి వీడియోలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందా? లేక వీరికి పోర్న్ స్టార్స్ గా ముద్రవేసి లైట్ తీస్కుందా? అన్నది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. విదేశాల్లో కొన్నిచోట్ల అయితే ఇలాంటి వాటికి చట్టబద్ధత ఉంటుంది? ప్రత్యేకించి పోర్న్ స్టార్ అనే ముద్ర వేసి లైసెన్సులు ఇస్తుంటారన్నది తెలిసిందే.
Please Read Disclaimer