ఇకనైనా ఆల్ సిస్టర్స్ మేల్కొవాలి: హీరోయిన్ పూర్ణ

0

సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పూర్ణ. రవిబాబు రూపొందించిన `అవును` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల పూర్ణను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన నలుగురు సభ్యుల ముఠాను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఆ నలుగురు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అష్రఫ్ రఫీఖ్ శరత్ రమేశ్ ఉన్నారు. నలుగురూ పూర్ణను బెదిరిస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. అయితే నిందితులు నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. గతంలో కూడా వీరు ఇతర ప్రముఖులను ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ముఠా అరెస్ట్ గురించి తెలియగానే అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

అయితే ఈ ఘటనపై మీడియాలో వస్తున్న వార్తల పై నటి పూర్ణ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాను ఉద్దేశిస్తూ పూర్ణ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే అసలు ఏం జరిగిందంటే.. తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అన్వర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్ కాల్స్ ద్వారానే పెళ్లి సంబంధాల పేరుతో తమకు దగ్గరయ్యాడు. అయితే ఎప్పుడూ కూడా అతనితో వీడియో కాల్ మాట్లాడలేదు. కానీ ఓసారి ఇంటికి వచ్చి వెళ్లాడు. అప్పటినుండి అనుమానం మొదలైంది. ఆ తర్వాత అతను ముఠాతో కలిసి బెదిరించడం.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పూర్ణ పోలీసులను సంప్రదించింది. పూర్ణ పోస్ట్ ద్వారా.. ‘ఈ ఇబ్బందికర సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.

నా కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను రాశాయి. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ బ్లాక్ మెయిల్ కేసులోని నిందితుడితో కానీ ఆ ముఠాతో కానీ నాకు ఎలాంటి లింక్ లేదు. నిందితుడితో లింక్ పెట్టి తప్పుడు వార్తలను రాయొద్దని మీడియాను కోరుతున్నట్లు” తెలిపింది. మేం పోలీసులకు ఫిర్యాదు చేద్దామనేలోపు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. కానీ టైంకి కేరళ పోలీసులు స్పందించారు. వారిని అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ పూర్తయ్యాక మీడియా ముందుకు వస్తానని పూర్ణ తెలిపింది. నా జీవితంలో ఎదురైన ఇలాంటి బ్యాడ్ టైంలో నాకు మద్దతుగా నిలబడిన ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు జరిగిన ఈ ఘటన ద్వారా మిగతా సిస్టర్స్ మేల్కొంటారని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నట్లు” పూర్ణ వెల్లడించింది.
Please Read Disclaimer