సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

స్టార్ కమేడియన్ సీక్రెట్ మ్యారేజ్

0

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. తమిళ్ లో యోగి సినిమాతో పరిచయమైన యోగి బాబు అటుపై వరుసగా స్టార్ హీరోల సినిమాలతో టాప్ కమెడియన్ గా ఎదిగాడు. విజయ్- ధనుష్- సూర్య – అజిత్ సహా ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ పండించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ లో రజనీతో కలిసి కామెడీ పండించాడు. గడిచిన నాలుగేళ్ల లో కమెడియన్ గా ఎక్కువ సినిమాలు చేసింది యోగిబాబే. వడివేలు- వివేక్- సంతానం ఫేడవుట్ అయిపోయి సైడైపోవడం యోగి బాబుకు కలిసొచ్చింది. ఆ క్రమంలోనే అతడు దూకుడు కొనసాగిస్తున్నాడు. నిత్యం సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు.

తాజాగా ఈ స్టార్ కమెడియన్ తమిళనాడులోని మురుగప్పన్ గుడిలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంటుగా వివాహం చేసుకున్నాడు. పెద్దల చూసిన అమ్మాయినే యోగి బాబు వివాహం చేసుకున్నాడు. వధువు పేరు మంజు. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు- కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో డీసెంట్ గా జరిగింది. మార్చిలో చెన్నైలో సినీ ప్రముఖలందరినీ ఆహ్వానించి ఘనమైన రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న సమయంలో ఈ వివాహానికి సినీ ప్రముఖులెవరినీ ఆహ్వానించలేదు. సోషల్ మీడియాలో గానీ.. మీడియాకి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడంతో వివాహం రహస్యం గా జరిగిందని నెటిజనులు కామెంట్ల తో వేడెక్కిస్తున్నారు.

ఇటీవలే యోగిబాబు దర్బార్ సినిమా లో కౌశిక్ పాత్రలో నటించాడు. రజనీతో యోగిబాబు చాలా సేపు తెరను పంచుకోవడం విశేషం. మురుగదాస్ తన కోసం ఓ పూర్తి లెంగ్త్ ఉన్న పాత్రనే క్రియేట్ చేసాడు. ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం యోగిబాబు దనుష్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వం లో తెరకెక్కుతోన్న కర్ణన్ (కర్ణ) సినిమా లో నటిస్తున్నాడు. ఇటీవలే యోగిబాబు పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం యోగి పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Please Read Disclaimer