నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న భామ!

0

హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగాలంటే ఎవరికైనా సరైన యాటిట్యూడ్ ఉండడం ముఖ్యం. నటన.. గ్లామర్ తో పాటు నిర్మాతలను ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మసలుకుంటేనే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఈమధ్య ఒక టాలీవుడ్ హీరోయిన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెండు మూడేళ్ళ క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు మొదట్లో రెండు మంచి హిట్స్ తగలడంతో ఫుల్ డిమాండ్ వచ్చింది. అయితే తర్వాత ఫ్లాపుల సీరీస్ మొదలైంది. వరసగా అరడజను ఫ్లాపులతో కెరీర్ ఇక ఫినిష్ అయింది అనే స్టేజికి చేరింది. సరిగ్గా అదే సమయంలో ఒక మల్టిస్టారర్ సినిమాతో హిట్ సాధించింది. తర్వాత మరో సినిమాలో నటిస్తే అది డిజాస్టర్ అయింది. ఇప్పుడు చేతిలో ఒక తెలుగు సినిమా ఉంది కానీ అమ్మడి దెబ్బకు నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

రీసెంట్ గా తనతో సినిమా ఒప్పుకున్న ఫిలిం యూనిట్ వారికి లంచ్ బిల్ పంపిందట. ఒక్కపూట ఈ పాప బైట చేసిన లంచ్ చేస్తే వచ్చిన బిల్ ఎంతో తెలుసా?.. 8 వేలు. దీంతో సదరు ఫిలిం యూనిట్ వారు అవాక్కయ్యారట. అసలే ఈ బ్యూటీ నటించిన గత 8 చిత్రాల్లో 7 ఫట్లు.. ఇప్పుడు చేతిలో ఉండేది ఒకే తెలుగు సినిమా. ఆ సినిమా అటూ ఇటూ అయితే కొత్త ఆఫర్లు రావడం కూడా కష్టమే. ఇక పాప స్లిమ్ముగా ఉంటుందా అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే అది ఈ భామకే కష్టం అని అంటున్నారు. ఈ బ్యాడ్ టాక్ కూడా అత్యంతవేగంగా టాలీవుడ్ లో స్ప్రెడ్ అవుతోందట. ఇకనైనా పాప జాగ్రత్తపడడం మంచిదని అంటున్నారు.
Please Read Disclaimer