భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

‘పలాస’ అయినా అతడికి పనికొచ్చేనా?

0

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పలాస 1978’ చిత్రంలో విలన్ గా రఘు కుంచె నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కూడా ఆయనే. రెండు విధాలుగా రఘు కుంచెకు ఈ సినిమా చాలా కీలకం. అందుకే ఈ సినిమా ఫలితం కోసం రఘు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బుల్లి తెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన రఘు మెల్ల మెల్లగా తన ప్రతిభతో సంగీత దర్శకుడిగా మారాడు. గాయకుడిగా సంగీత దర్శకుడిగా మంచి హిట్స్ పడ్డా కూడా లక్ కలిసి రాక పోవడమో లేక మరేంటో కాని స్టార్ డం దక్కించుకోలేక పోయాడు.

గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా కెరీర్ ను అలా అలా నెట్టుకుంటూ వస్తున్న రఘు కుంచెకు పలాస చిత్ర దర్శకుడు కరుణ కుమార్ విలన్ పాత్రను ఆఫర్ చేశాడు. తాను అనుకున్న పాత్రకు రఘు కుంచె సెట్ అవుతాడని అతడు నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చాడట. సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తప్పకుండా సినిమా బాగుంటుందనే టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ వంటి ప్రముఖులు సినిమా పై ప్రశంసలు కురిపించడంతో సినిమాపై జనాల్లో కూడా ఆసక్తి పెరిగింది.

మంచి హైప్ మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస చిత్రం అయినా రఘు కుంచెకు నటుడిగా బ్రేక్ ఇస్తుందా.. సంగీత దర్శకుడిగా స్టార్ డంను కట్టబెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. రఘు ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా చాలా ప్రయత్నించాడు. ఈ సినిమాలో విలన్ గా హిట్ అయితే ఇక వరుసగా నటనకే ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక పలాస చిత్రం రఘు కుంచెకు ఏమైనా పనికి వచ్చేనా చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-