అశ్వ‌నీద‌త్‌కు పోసాని త‌లంటేశారుగా!

0

ఎలాంటి విష‌యాన్నైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా ఇండ‌స్ట్రీలో మాట్లాడే ఏకైక వ్య‌క్తి పోసాని కృష్ణ‌ముర‌ళి. గ‌త కొంత కాలంగా వైసీపీకి సానుభూతిప‌రుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని బాహాటంగానే చెప్పిన వ్య‌క్తి ఆయ‌న‌. చంద్ర‌బాబు నాయుడుని మీడియా సాక్షిగా క‌డిగిపారేసిన పోసాని ఆ త‌రువాత నుంచి వార్త‌ల్లో కెక్క‌డం మొద‌లుపెట్టారు.

ఇటీవ‌ల అనారోగ్యం కార‌ణంగా శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న ఆయ‌న ప్ర‌స్తుతం ఇంటి ద‌గ్గ‌ర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయ‌న‌కు సినిమాల్లో వేశాలు ఇవ్వ‌డం లేద‌ని, కొంత మంది ఆయ‌న‌ను దూరం పెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను క‌లిసిన ఓ టీవీ ఛాన‌ల్‌కు సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించారాయ‌న‌.తాను జ‌గ‌న్‌కు బాహాటంగా మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో సినిమా వాళ్ల‌కు కోపం వ‌చ్చింద‌ని, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డిన వేళ త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం మానేశార‌ని చెప్పుకొచ్చారు.దానికి ప్ర‌ధాన కార‌కుడు నిర్మాత అశ్వ‌నీద‌త్ అని చెప్ప‌డంతో ఆ వార్త ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ విష‌యం ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దాకా వెళితే పరిస్థితి ఏంట‌ని? అంతా గుస‌గుస‌లాడుకుంటున్నారు.అశ్వ‌నీద‌త్ గ‌తంలో టీడీపీ త‌రుపున విజ‌య‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేసి దారుణంగా ఓట‌మి పాల‌య్యారు. అక్క‌డి నుంచి ఆ పార్టీకి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల వేళ బోయ‌పాటి శ్రీ‌నుతో టీడీపీ కోసం ఆయ‌న ప‌లు ప్ర‌చార చిత్రాల్ని రూపొందించారు.
Please Read Disclaimer