పోసానికి రెండోసారి ఆపరేషన్?

0

ప్రముఖ దర్శకరచయిత.. నటుడు పోసాని కృష్ణ మురళి ఎన్నికల సమయంలో ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ కు మద్ధతుగా మీడియా ముందు ఆయన ప్రసంగాలు హీటెక్కించాయి. ఆ ఎపిసోడ్స్ ని జనాలు ఇంకా మర్చిపోలేదు. అయితే ఇంతలోనే ఆయన సైలెంటవ్వడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ పోసానికి ఏమైంది? అంటే..

పోసాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నికల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని తెలుస్తోంది. ఇటీవలే ఆయనకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. మొదటి సారి శస్త్ర చికిత్స ఫెయిలవ్వడంతో ఇన్ ఫెక్షన్ సోకిందని.. తిరిగి రెండోసారి సర్జరీ చేయాల్సి వచ్చిందని సన్నిహితుల నుంచి రివీలైంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రి నుంచి మరో రెండ్రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.

టాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీ ఆర్టిస్ట్ పోసాని. 2018 -19 సీజన్ లో పలువురు స్టార్ హీరోల సినిమాలతో పాటు నవతరం సినిమాల్లోనూ చక్కని పాత్రల్లో నటించి మెప్పించారు. ఇటీవల రిలీజైన మహర్షి- మజిలీ- చిత్రలహరి చిత్రాల్లో పోసాని పాత్రలు ఆకట్టుకున్నాయి. నిఖిల్ `అర్జున్ సురవరం`లోనూ పోసాని కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రానుంది. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లోనూ పోసానికి ఛాలెంజింగ్ పాత్రల్లో ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది.
Please Read Disclaimer