‘మజిలీ’లో దాని అమ్మమ్మలా ఉన్నావ్!

0

పోసాని ఎక్కడ ఉంటే కాంట్రవర్శీ అక్కడ ఉంటోంది. సూటిగా కొట్టినట్టు మాట్లాడేస్తూ ఆయన తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. లోన ఉన్నది నిక్కచ్ఛిగా బయటికి ఓపెన్ గా మాట్లాడేయడం ఈ దర్శకరచయిత కం నటుడికి చెల్లినట్టుగా ఇంకొకరికి చెల్లదు. అయితే ఇటీవల కాస్తంత డోస్ పెంచి సన్నివేశాన్ని వేడెక్కిస్తూ వాడి వేడిగా చర్చల్లోకొస్తున్నారు. ఎంతయినా దర్శకరచయిత కదా.. ఆ మాత్రం ఘాటుగా లేకపోతే జనాలకు కూడా రుచించడం లేదు. ఇకపోతే ఆయన నాగచైతన్యపైనా.. అక్కినేనీస్ పైనా ఓ రెండు ఛమక్కులు వదిలారు. పార్క్ హయత్ లో `మజిలీ` సక్సెస్ వేదిక అందుకు నిలువెత్తు సాక్ష్యం.

చైతన్యను ఉద్ధేశించి పోసాని మాట్లాడుతూ.. మొదటి సినిమా `జోష్`లో బొమ్మలా ఉంటే `మజిలీ`లో దాని అమ్మమ్మలా ఉన్నావ్! అంటూ తనదైన శైలిలో పొగిడేశారు. ఈయన తిడుతున్నారా పొగుడుతున్నారో అర్థం కాని చైతూ కాస్త తమాయించుకుని పొగిడారనుకున్నాక సైలెంట్ గా నవ్వేశారు. మరో చమక్కు అక్కినేనీస్ పైనే విసిరారు పోసాని. దేవదాసులో అక్కినేని నాగేశ్వరరావు తాగుబోతు పాత్ర చేశాడు. ఆయన నటించిన తర్వాత ఎవరు తాగుబోతు పాత్ర చేసినా బాగా చేయలేదనే ఫీలింగే కలిగింది. కృష్ణగారి దేవదాసు కూడా చూశాను. ఆ సినిమా .. ఏఎన్నార్ సినిమాతో పోల్చుకుంటే ప్లాప్. కృష్ణుడు పాత్రను రామారావుగారు వేసిన తర్వాత ఆ పాత్రను ఎవరు వేసినా చూడలేకపోయాం. తాగుబోతు పాత్రను ఎ.ఎన్.ఆర్ వేసిన తర్వాత మిగతా వాళ్లని చూడలేం. కానీ నాగార్జున తాగుబోతు పాత్ర చేశాడు. కానీ వాళ్ల నాన్నలా చేయలేదు. ఆయన ఫిజిక్ ని దృష్టిలో పెట్టుకుని చేసి సక్సెసయ్యాడు. మజిలీలో కూడా చైతన్య తాగుబోతు పాత్ర చేశాడు. అయితే వాళ్ల తాతగారిలా నాన్నగారిలా నటించలేదు. తన శరీరం ఎంత వరకు సహకరిస్తుందో.. అంత పర్ఫెక్ట్గా లిమిట్ లో చేశాడు“ అంటూ తనదైన శైలిలో పొగిడేశారు.

ఇటీవల చిత్రలహరి.. మజిలీ చిత్రాల్లో తండ్రి పాత్రలకు మంచి పేరొచ్చిందని – సెంటిమెంట్ పాత్రలు చేయడం ఇష్టమని పోసాని తెలిపారు. అలాగే పోలీస్ పాత్రలంటే నచ్చదు ఎందుకంటే.. నేను శ్రీహరికి చాలా పోలీస్ క్యారెక్టర్స్ రాశాను. పోలీస్ అంటే ఆయనలా ఫిట్గా ఉండాలి. నేను అంత ఫిట్గా ఉండను. ఆ డ్రెస్ వేసుకుంటే చెండాలంగా ఉంటాననే భయం. అయితే అలాంటి పాత్రలో నాకు పేరొచ్చింది టెంపర్ సినిమాలో అలాంటి పాత్రలోనే చేశాను.. అని నిజాయితీగా చెప్పేశారు.
Please Read Disclaimer