అనారోగ్యం నిజమే కాని ఇప్పుడు బాగానే ఉన్నా

0

మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైకాపా తరపున ప్రచారం చేసి అందరి దృష్టి ఆకర్షించిన పోసాని కృష్ణ మురళి ఆ వెంటనే అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఆపరేషన్ చేసిన వైధ్యులు డిశ్చార్జ్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ వికటించిందని.. ఆపరేషన్ చేసిన చోట ఇన్ఫెక్షన్ అయ్యిందని ప్రచారం జరిగింది. దాంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆ కారణంగానే మళ్లీ ఆపరేషన్ జరిగినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న వార్తలపై పోసాని స్పందించారు. ఒక వీడియో బైట్ ను ఆయన విడుదల చేశారు. అందులో.. కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగాలేని విషయం నిజమే. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. కాని చనిపోయేంత సమస్య అయితే ఏమీ లేదు. యశోదలో డాక్టర్ ఎంవీ రావు గారు నాకు చికిత్స చేసి బతికించారు. ప్రస్తుతం పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎలాంటి భయం అక్కర్లేదు. పది రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాను. నా ఆరోగ్యం గురించి కంగారు పడ్డ వారికి.. నా కోసం పూజించిన వారికి కృతజ్ఞతలు అంటూ పోసాని వీడియోలో చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer