రష్మిక మాజీ ప్రియుడు హిట్ కొట్టాడు!

0

తెలుగులో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ షెట్టి ఇటీవల తెలుగు వార్తల్లోకి వచ్చాడు. రష్మికతో ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్లాడు ఇతను. వీరిద్దరి కాంబోలో వచ్చిన కిరిక్ పార్టీ సినిమా సూపర్ హిట్ కావడం ఆ వెంటనే వీరు ప్రేమలో పడిపోవడం ఎంగేజ్ మెంట్ చేసుకోవడం తెలిసిన సంగతే. రష్మిక తెలుగులో బిజీ అయ్యాకా వీరి ఎంగేజ్ మెంట్ రద్దు అయ్యింది. ఆ విషయం గురించి ఇటీవల స్పందించిన రక్షిత్ షెట్టి.. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

అలా పెద్ద మనసుతో వ్యవహరించిన రక్షిత్ కు ఇప్పుడు మంచి విజయం లభించినట్టుగా ఉంది. *అవనే శ్రీమన్ నారాయణ* పేరుతో రక్షిత్ షెట్టి హీరోగా ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాకు సర్వత్రా మంచి రివ్యూలు – రేటింగులు లభిస్తున్నాయి. ఇదొక ఫాంటసీ ఎంటర్ టైనర్ అని జాతీయ మీడియా వర్గాలు పాజిటివ్ రివ్యూలను ఇచ్చాయి. ఈ సినిమాలో రక్షిత్ షెట్టి నటనకు కూడా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. హీ స్టీల్స్ ది షో అంటూ.. ఇంగ్లిష్ మీడియా వర్గాలు రక్షిత్ ను ప్రశంసించాయి.

ఇలా రష్మిక మాజీ ప్రియుడి సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులోకి కూడా అనువదించినట్టుగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ భాషలోకి కూడా ఈ సినిమాను అనువదించి నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ అనువాదాలకు సరైన పబ్లిసిటీ లేదు. ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో.. రక్షిత్ షెట్టి కన్నడ సినిమాకు తెలుగునాట కూడా ఏమైనా థియేటర్లు లభించి పాజిటివ్ పబ్లిసిటీ వస్తుందేమో చూడాలి!
Please Read Disclaimer