మహేష్ కోసం అన్నయ్య ..బన్నీ కోసం తమ్ముడు

0

ఓ సినిమా ఈవెంట్ కి మరో హీరో గెస్ట్ గా రావడం టీం ను అభినందిస్తూ మాట్లాడటం సహజమే. అయితే ఈ సారి సంక్రాంతి సినిమాల కోసం మెగా బ్రదర్స్ గెస్ట్ లుగా మారబోతున్నారు. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల ఎల్.బి.స్టేడియంలో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరువుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 6న జరగబోయే బన్నీ ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నాడు.

తాజాగా విజయవాడ వెళ్లి తన మిత్రుడు పవన్ ను ఈవెంట్ కి ఆహ్వానించాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ గా వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఐదున మహేష్ సినిమా గురించి మెగా స్టార్ స్పీచ్ ఇస్తే ఆ మరుసటి రోజు పవర్ స్టార్ బన్నీ సినిమా గురించి మాట్లాడనున్నాడు. ఇలా రెండు రోజులు మెగా బ్రదర్స్ మీడియాలో స్పీచ్ లతో హంగామా చేయడానికి రేడీ అవుతున్నారు.

ఈ సంక్రాంతి నువ్వా నేనా అనే రేంజ్ లో ఉన్న స్టార్ హీరోల పోటీ మెగా బ్రదర్స్ సపోర్ట్ తో మరింత హాట్ టాపిక్ అవ్వనుంది. మరి సంక్రాంతి సినిమాలకు మెగా సపోర్ట్ ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.
Please Read Disclaimer