డార్లింగ్ ఛాన్సిస్తే కాజల్ లక్కీనే

0

డార్లింగ్ ప్రభాస్ కెరీర్ 20వ సినిమా `జాన్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయిక. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్- యువీ క్రియేషన్స్ సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో యూరప్ ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబిస్తూ నగరాన్ని సెట్ లో నిర్మించి అందులోనే కీలక షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్నారు. పేద అమ్మాయిని ప్రేమించే రిచ్ గయ్ లవ్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఓ ప్రచారం వేడెక్కించింది.

తాజాగా ఈ సినిమా కాస్టింగ్ లో చందమామ కాజల్ పేరు వినిపిస్తుండడం వేడెక్కిస్తోంది. కాజల్ ఈ చిత్రంలో ఓ అతిధి పాత్రలో మెరవబోతోందని తాజా షెడ్యూల్ లో తను కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ప్రభాస్ – కాజల్ కాంబినేషన్ అంటే డార్లింగ్- మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రాలు గుర్తుకొస్తాయి. డార్లింగ్ సమయంలో ఆ ఇద్దరిపైనా పుట్టుకొచ్చిన రూమర్లు గుర్తుకొస్తాయి. ఇక ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ప్రభాస్ సరసన నటించే అవకాశం కాజల్ కి రాలేదు. ఇన్నాళ్టి కి డార్లింగు తో మరో ఛాన్స్ .. అది కూడా అతిధి పాత్ర కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే డార్లింగ్ టైమ్ కి ఇప్పటికి ప్రభాస్ లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అతడు బాహుబలి స్టార్. పాన్ ఇండియా హీరో. ఈ ఇమేజ్ వల్ల జాన్ కూడా పాన్ ఇండియా రేంజులోనే రిలీజవుతుందనడంలో సందేహం లేదు. అందుకే ఇలాంటి సినిమాలో అతిధి పాత్రకు అయినా కాజల్ సై అనేస్తోందన్న గుసగుస వినిపిస్తోంది. ఇకపోతే ఇలాంటి అరుదైన అవకాశం వదులుకోలేకనే ప్రభాస్ ని రెక్వస్ట్ చేసిందంటూ అభిమానుల్లో ముచ్చట సాగుతోంది. ఇక హిందీ పరిశ్రమలో కాజల్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. జాన్ లో నటిస్తే అది తనకు అక్కడా ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Please Read Disclaimer