ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టేటస్

0

ప్రభాస్ 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం ప్రభాస్ తదుపరి చిత్రం మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతుంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించబోతున్నాడు. ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో ఒక అద్బుతమైన ఫాంటసీ కథను దర్శకుడు నాగ్ అశ్విన్ రెడీ చేశాడట. స్టోరీ లైన్ విని ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పాడు.

దర్శకుడు నాగ్ అశ్విన్ సుదీర్ఘ సమయం తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అవ్వడంతో ప్రస్తుతం సాంకేతిక నిపుణుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించేందుకు నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. స్క్రిప్ట్ విషయంలో కూడా కొందరు హాలీవుడ్ డైరెక్టర్స్ మరియు రైటర్స్ సలహాలు మరియు సూచనలు తీసుకున్నాడట.

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న ప్రభాస్ కు ఈ చిత్రంతో పాన్ వరల్డ్ క్రేజ్ ను తెచ్చి పెట్టాలని దర్శకుడు నాగ్ అశ్విన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంగ్లీష్ లో డబ్ అయ్యి హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ప్రభాస్ 21వ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం అయ్యి సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం హీరోయిన్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.
Please Read Disclaimer