ప్రభాస్ అయినా మాటపై నిలబడేనా?

0

‘బాహుబలి’ చిత్రం కోసం నాలుగు సంవత్సరాలు.. సాహో చిత్రం కోసం దాదాపుగా రెండేళ్లు సంవత్సరాలు సమయం కేటాయించాడు ప్రభాస్. బాహుబలి చిత్రం తర్వాత ఆలస్యం చేయకుండా వరుసగా చిత్రాలు చేస్తాడనుకుంటే సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రభాస్ చేశాడు. 350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిన కారణంగా రెండేళ్లకు పైగానే పట్టింది. సాహో చేస్తున్న సమయంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రభాస్ మొదలు పెట్టాడు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇతర స్టార్ హీరోలు సంవత్సరంకు ఒకటి రెండు అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తుంటే ప్రభాస్ మాత్రం మరీ ఇంత స్లోగా సినిమాలు చేయడం ఫ్యాన్స్ లో ఒకింత అసహనం కలిగిస్తుంది. ఇకపై సినిమా సినిమాకు మద్య ఎక్కువ సమయం తీసుకోను అంటూ ప్రభాస్ ప్రకటించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటూ హామీ ఇచ్చాడు. గతంలో ప్రభాస్ మాదిరిగా పలువురు హీరోలు కూడా ఏడాదికి రెండు సినిమాలు చేస్తామంటూ అభిమానులకు మాట ఇచ్చారు.

హీరోలకు ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే కోరిక ఉంటుంది. కాని వారు తమ ప్రమేయం లేకుండానే లేట్ గా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రభాస్ కూడా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని గట్టిగానే తల్చుకున్నట్లుగా అనిపిస్తుంది. కాని ఒక సినిమా తర్వాత ఒకటి చేసేందుకు దర్శకులు.. నిర్మాతలు.. డేట్లు.. హీరోయిన్స్ ఇలా పలు విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కనుక ప్రభాస్ కూడా ఏడాదికి రెండు సినిమాలు అనే మాటపై నిలబడటం కష్టం అనిపిస్తుంది.

స్టార్ హీరోలు ఎవరైనా ఏడాదిలో రెండు సినిమాలు రెగ్యులర్ గా చేయడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు. స్టార్ హీరోల సినిమాలు అంటే విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కనుక రెగ్యులర్ గా సినిమాలు చేయడం అంటే కష్టమే. ప్రభాస్ ఈ విషయంలో ఏమేరకు సఫలం అవుతాడనేది చూడాలి.
Please Read Disclaimer