ప్రభాస్ ని ప్రేమించేది ఇందుకే

0

సినిమా సక్సెస్ అయితే తమ గొప్పని చెప్పుకుని తేడా కొడితే దర్శకుడి మీదా తోసేసే కొందరు స్టార్లున్న ట్రెండ్ లో వాటికి అతీతంగా జాతీయ స్థాయిలో గుర్తింపున్న హీరో ప్రభాస్ ప్రవర్తించడం ఒకరకంగా వింతనే చెప్పాలి. సాహో ప్రమోషన్స్ లో అలుపు తెలియకుండా రాష్ట్రాల వెంబడి తిరుగుతూ విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న ప్రభాస్ తన ఒదిగి ఉండే మనస్తత్వాన్ని మాత్రం ఎక్కడా కోల్పోవడం లేదు. జర్నలిస్టులు ఎంత అవసరం లేని ప్రశ్నలు అడిగినా చాలా కూల్ గా సమాధానం ఇస్తున్నాడు.

సాహోకు ఇప్పుడున్న క్రేజ్ మార్కెట్ తన వల్ల వచ్చింది కాదని బాహుబలి 2 తర్వాత దాని సక్సెస్ వల్ల తనకో ఐడెంటిటీ వచ్చిందే తప్ప కేవలం తన కారణంగా సినిమాలు ఆడుతున్నాయన్న కామెంట్ ని డార్లింగ్ ఒప్పుకోవడం లేదు. సాహో ఆడాక తర్వాత వచ్చే సినిమా రిజల్ట్ ని బట్టి అప్పుడు తన రేంజ్ ని డిసైడ్ చేయొచ్చంటున్న ప్రభాస్ నిజాయితీ అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తన మాటల్లో నిజం ఉంది.

బాహుబలి లేకపోతే ఇప్పుడు సాహో ఇంత బడ్జెట్ తో తీసే ఆలోచనే వచ్చేది కాదు. మిర్చి తరహా కమర్షియల్ జోనర్ కి కట్టుబడాల్సి వచ్చేది. అందుకే ఈ సత్యాన్ని గుర్తించే ప్రభాస్ బాహుబలికి ఇవ్వాల్సిన క్రెడిట్ ని ఇంకా ఇస్తూనే రాజమౌళి పట్ల తన గౌరవాన్ని ప్రకటిస్తున్నాడు. ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం వల్లే మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఇండస్ట్రీని ఏలారని తమ హీరో కూడా అదే తరహా మనస్తత్వంతో హీరోగా తెరమీద వ్యక్తిగా బయట మనసులు గెలుచుకుంటున్నాడని అభిమానులు మురిసిపోతున్నారు. అవును వాళ్ళ ఆనందంలో పాయింట్ ఉంది మరి. ఒప్పుకోవాల్సిందే
Please Read Disclaimer