లక్ష మంది ఫ్యాన్స్ దూసుకొస్తున్నారు!

0

తాము ఆరాధించే స్టార్ హీరో కళ్లముందు సాక్షాత్కరిస్తే ఒక్క అభిమానిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఒకే సారి లక్ష మంది అభిమానులు దూసుకొస్తే…ఆ దృశ్యాన్నిమాటల్లో వర్ణించలేం. ఇలాంటి దృశ్యమే ఈ నెల 18న హైదరాబాద్ శివారులో వున్న రామోజీ ఫిల్మ్ సిటీలో లైవ్ లోకి రాబోతోంది. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం `సాహో`. వన్ ఫిల్మ్ బేబీ సుజీత్ రూపొందిస్తున్న ఈ సినిమా పబ్లిసిటీ ఏర్పాట్లు ఓ రేంజ్లో వుండబోతున్నాయి. ఈ నెల 18న `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ని వినూత్నంగా భారీ స్థాయిలో సౌత్ సినీ పరిశ్రమలో ఇంత వరకు ఏ సినిమాకు జరగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఫంక్షన్ కోసం ఏకంగా ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని లక్ష మందిని ఇప్పటికే సెలెక్ట్ చేసిన చిత్ర బృందం వారి మధ్య `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ ని నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇలాంటి ఈ వెంట్ సినిమాకు భారీ స్థాయిలో పబ్లిసిటీని తెచ్చిపెట్టినా అదే స్థాయిలో రిస్క్ ని కూడా తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. గతంలో జరిగిన బాద్ షా – రామ్ చరణ్ వినయవిధేయ రామ చిత్రాలకు భారీగా అభిమానుల్ని తరలించడంతో పెద్ద గందరగోళం నెలకొని – ఓ సందర్బంలో ఓ అభిమాని చనిపోయిన సంఘటన కూడా ఇంకా గుర్తుంది.

అంతే కాకుండా ఇటీవల ఓ విమానాశ్రయంలో అజాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ని ఓ లేడీ అభిమాని ఆనందం పట్టలేక ఇది కలో నిజమో తేల్చుకోవడానికి ఏకంగా ప్రభాస్ చెంప ఛెల్లు మనిపించి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఒక్క అభిమానికే అలా వుంటే ఈ నెల 18న ఏకంగా లక్ష మంది అభిమానుల మధ్య `సాహో` ప్రీరిలీజ్ వేడుక ఏ స్థాయిలో వుండబోతోందో ఫ్యాన్స్ చేసే హంగామాని ప్రభాస్ అండ్ కో ఏ మాత్రం తట్టుకోగలరో చూడాలి మరి.
Please Read Disclaimer