క్షణమైనా విడిచి ఉండలేని డార్లింగ్!

0

డార్లింగ్ ప్రభాస్ – శ్రద్ధా కపూర్ జంట గురించి ప్రస్తుతం అభిమానులు ఏమని అనుకుంటున్నారు? అంటే రకరకాల ప్రచారం సాగుతోంది. సాహో కోసం డార్లింగ్ ప్రత్యేకించి ముంబై బ్యూటీ శ్రద్ధానే ఎందుకు ఏరికోరి ఎంచుకున్నాడు? అంటూ కారణాల్ని వెతుకుతున్నారు. తన స్నేహితురాలు అనుష్కను ఎందుకని ఎంపిక చేసుకోలేదు? అన్న ఆవేదనా కొందరు అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఏదైతేనేం.. సాహో మరో ఇరవై రోజుల్లోనే రిలీజ్ కి వచ్చేస్తోంది. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ ప్రతి వేదికపైనా శ్రద్ధాతో కనిపిస్తుంటే ఫ్యాన్స్ లో అంతకంతకు ఆసక్తి రెయిజ్ అవుతోంది.

ఇటీవల ముంబైలో మీడియా మీట్ అనంతరం నిన్న హైదరాబాద్ లో ఈ జోడీ తెలుగు మీడియా ముందుకు వచ్చింది. అయితే ప్రతిచోటా డార్లింగ్ కేరింగ్ గురించే ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు ఫ్యాన్స్. శ్రద్ధా పై ఈగ అయినా వాలనివ్వనంతగా కేరింగ్ తీసుకున్నాడు డార్లింగ్. అసలే శ్రద్ధా ఇప్పటికే డార్లింగ్ కి ఫిదా అయిపోయింది. అమేజింగ్ కోస్టార్! అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. మనసున్న మహారాజా! అంటూ ప్రభాస్ వ్యక్తిత్వానికి ఎంతో ఇదైపోయింది. అంతేనా.. శ్రద్ధా ఎక్కడ ఉన్నా డార్లింగ్ కూడా ఎంతో కేరింగ్ గా చూసుకుంటున్నాడు. ఆషిఖి 2 చూడగానే ప్రేమలో పడిపోయాడో ఏమో కానీ శ్రద్ధా తనని హాంట్ చేసిందని అందరికీ అర్థమైంది.

అయితే ప్రభాస్ స్వభావమే అంత. తనతో నటించే లేడీ కోస్టార్స్ ని ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకోవడం తన అలవాటు. అనుష్కతోనూ అలానే స్నేహం కుదిరింది. ఇదివరకూ అనుష్కను ఇలానే కేరింగ్ గా చూసుకోవడం వల్లనే ఆ ఇద్దరి మధ్యా ఏదో ఉంది! అంటూ ప్రచారం సాగింది. అయితే స్నేహితులం మాత్రమేనని ఆ జంట చెప్పుకొచ్చారు. మరోసారి శ్రద్ధాతోనూ డార్లింగ్ అంతే కేరింగ్ గా ఉంటున్నాడు కాబట్టి ముంబై మీడియాకి ఇలా కంట పడితే కష్టమే. ప్రభాస్ గురించి సన్నిహితంగా తెలిసిన వారు మాత్రం లేడీస్ అంటే అతడికి ఉండే రెస్పెక్ట్ అలాంటిది అంటూ కన్విన్స్ అయిపోతున్నారు.
Please Read Disclaimer