మరోసారి నొక్కి ఒక్కాణించిన డార్లింగ్

0

‘బాహుబలి’ ఫ్రాంచైజీ ఘన విజయం సాధించడంతో ప్రభాస్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ నటించే సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. దీంతో ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ ను బహు భాషా చిత్రంగా విడుదల చేస్తున్నారు. ‘సాహో’ ఈ నెలాఖరులోనే రిలీజ్ కానుండడంతో ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాడు. హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ప్రతి ఇంటర్వ్యూలో ప్రభాస్ కు ఎదురవుతున్న ప్రశ్నలలో ఒకటి.. హీరోయిన్ అనుష్కతో డేటింగ్.. మ్యారేజ్ కు సంబంధించిన ప్రశ్న. గతంలో కూడా ప్రభాస్ – అనుష్కపై ఇలాంటి రూమర్లు వచ్చినప్పటికీ ఈమధ్య మరోసారి ఊపందుకున్నాయి. జస్ట్ డేటింగ్ రూమర్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ మీడియా ఇంకాస్త ముందుకెళ్ళి ‘సాహో’ తర్వాత ఇద్దరి పెళ్లి అని.. అమెరికాలోని లాస్ ఎంజేలెస్ లో ఒక ఇల్లు కూడా వెతుకుతున్నారని కథనాలు ప్రచురించాయి.

అనుష్కతో డేటింగ్.. పెళ్ళి వార్తలపై స్పందిస్తూ ప్రభాస్ “అనుష్క నేను చాలామంచి ఫ్రెండ్స్. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే గత రెండేళ్లలో ఎవరూ గమనించి ఉండరా? కరణ్ జోహార్ షో లో కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు.. రాజమౌళి… రానాలే ఇచ్చారు. నేనేమీ వారిని అలా సమాధానం చెప్పమని ప్రిపేర్ చెయ్యలేదు” అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా.. ఇద్దరిలో ఒకరికి.. లేదా ఇద్దరికీ వివాహం అయ్యేవరకూ ఈ రూమర్ మాత్రం ఆగేలా లేదు!
Please Read Disclaimer