ప్రభాస్.. అఖిల్ లకు పూజా హెగ్డే టెన్షన్

0

కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడికి ఆగిపోయాయి. ఏప్రిల్ 1 తర్వాత మళ్లీ యధావిధిగా షూటింగ్స్ ఆరంభం అవుతాయని అంతా భావించినా కూడా పరిస్థితులు అలా కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల చివరి వరకు కూడా షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలో హీరోల హీరోయిన్స్ డేట్లు అంతా కూడా గందరగోళంగా మారుతున్నాయి. నెలల ముందే హీరోలు హీరోయిన్స్ డేట్లు కేటాయిస్తూ ఉంటారు.

ముఖ్యంగా స్టార్స్ పలు సినిమాలకు డేట్లు కేటాయించడం వల్ల వారం పది రోజులు షూటింగ్ ఆగిపోయినా కూడా మళ్లీ డేట్ల కోసం చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ ఇంకా అఖిల్ లు పూజా హెగ్డే విషయంలో టెన్షన్ పడుతున్నారు. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వారం పది రోజులు పూజా హెగ్డే షూటింగ్ లో పాల్గొంటే పూర్తి అవ్వనుంది. ఇక ప్రభాస్ ఓ డియర్ షూటింగ్ లో కూడా పూజా హెగ్డే పాల్గొనాల్సి ఉంది.

ఓ డియర్ కోసం జార్జియా వెళ్లిన యూనిట్ సభ్యులు కరోనా కారణంగా వారం రోజుల్లోనే తిరిగి వచ్చారు. పూజా హెగ్డే తోనే కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. కనుక మళ్లీ ఆమె డేట్లు అవసరం కానున్నాయి. మరో వైపు పూజా హెగ్డే హిందీలో సల్మాన్ కు కూడా జోడీగా నటించేందుకు ఒప్పుకుంది. ఆ సినిమాకు డేట్లు ఇవ్వాల్సి ఉంది. సల్మాన్ కు డేట్లు ఇస్తే ఈ రెండు సినిమాలకు ఆమె డేట్లు కేటాయించడం కష్టంగా మారే అవకాశం ఉందని.. దాంతో రెండు సినిమాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం బ్యాచిలర్ పై పడే అవకాశం ఉందంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-