రాయల్ ఆల్బర్ట్ హాల్ కి స్వీటీతో డార్లింగ్

0

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` సిరీస్ ఎంతటి సంచలనమో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 1-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాలతో దాదాపు 2500కోట్ల మేర వసూళ్లు దక్కాయని ట్రేడ్ తెలిపింది. దేశంలోనే నంబర్- 1 వసూళ్ల చిత్రంగా బాహుబలి 2 రికార్డులకెక్కింది. ఆ తర్వాతనే అమీర్ ఖాన్ నటించిన `దంగల్` నంబర్ 2గా నిలవడంపైనా ఆసక్తిగా ముచ్చటించుకున్నారు.

ఆ స్థాయి ఘనత సాధించింది కాబట్టే బాహుబలి మేకర్స్ కి దేశ విదేశాల్లో అరుదైన గౌరవం దక్కుతోంది. ఇప్పటికే బాహుబలి చిత్రాన్ని ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. ప్రతిచోటా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇతర కాస్ట్ అండ్ క్రూకి ప్రత్యేక గౌరవం గుర్తింపు దక్కాయి. ఈసారి అలాంటి మరో సదవకాశమే లండన్ రాయల్ ఆల్బర్ట్స్ థియేటర్ లో బాహుబలి దర్శకుడు రాజమౌళికి దక్కనుంది. అక్కడ బాహుబలిని ప్రదర్శించే అరుదైన అవకాశం లభించిందన్న సంగతి తెలిసిందే.

రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో బ్రిటన్ కి చెందిన పలువురు దిగ్గజాలు ప్రివ్యూని వీక్షించనున్నారు. అయితే స్క్రీనింగ్ ఆరంభించే ముందు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి -ఎం.ఎం.కీరవాణి బృందానికి రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రశ్నోత్తరాల సెషన్ ఉంటుందట. ఈ సెషన్స్ కి ప్రభాస్- అనుష్క-రానా- తమన్నా తదితరులు ఎటెండ్ కానున్నారని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశంలో బాహుబలి టీమ్ సందడి గురించి ఫిలింనగర్ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఇదే చోటికి ప్రభాస్ – అనుష్క జంటగా వెళుతుండడంతో అభిమానుల్లో రకరకాల స్పెక్యులేషన్స్ పెరగనున్నాయి. ఆ జంట కేవలం స్నేహితులం మాత్రమేనని పదే పదే చెబుతున్నా ఫ్యాన్స్ లో ఈ ఆసక్తికర చర్చ కొనసాగుతూనే ఉంది. లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ నుంచి ప్రభాస్- అనుష్క ఫోటోలు జోరుగా వైరల్ అవ్వడం ఖాయమేననడంలో సందేహమే లేదు. ఇక ఈ స్పెషల్ స్క్రీనింగ్ వేళ ప్రఖ్యాత మ్యూజిషియన్ లుడ్విగ్ విక్కీ రాయల్ ఫల్ హార్మనిక్ ఆర్కెస్ట్రాతో అలరించబోతున్నారట.
Please Read Disclaimer