శ్రద్ధకు ప్రేమ వైఫై కనెక్ట్ చేస్తున్న డార్లింగ్

0

సాహో.. సాహో.. సాహో. సినిమా ప్రియులందరూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చించుకుంటున్న సినిమా ఇదే. కాదు.. మేము పాత క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘బేసిక్ ఇన్ స్టింక్ట్’ గురించి చర్చించుకుంటున్నాం.. ‘సాహో’ గురించి మాకు తెలియదు.. వినలేదు అన్నారంటే వారు కరుడుగట్టిన యాంటి ఫ్యాన్స్ అన్నమాటే. అలాంటివాళ్ళ గురించి మనం వదిలేస్తే.. ఇప్పుడు దేశమంతటా సాహో మానియా ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఇక ‘సాహో’ టీమ్ కూడా ప్రమోషన్ మెటీరియల్ తో క్రేజును మరింతగా పెంచుతున్నారు.

తాజాగా ‘సాహో’ టీమ్ ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో డార్లింగ్ – శ్రద్ధ ఇద్దరూ ఫ్లోర్ పై కూర్చుని ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూఏవో ప్రేమ బాసలు మూగ సైగలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇద్దరి స్టైలింగ్ అదిరిపోయింది. శ్రద్ధ గ్రే కలర్ టీ షర్టు.. వీలైనంత పొట్టిగా ఉండే డెనిమ్ షార్ట్ వేసుకుని కూర్చుని ఉంటే.. డార్లింగ్ చిరుగుల జీన్స్.. పింక్ టీ షర్ట్ ధరించి ప్రేమ వైఫై ని శ్రద్ధాకు కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. కెమిస్ట్రీ లో ఎప్పుడూ ఆర్గానిక్ కెమిస్ట్రీ.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చంపుతూ ఉంటారు. అర్థం కానివారు బుర్ర గోక్కుంటూ ఉంటారు. అదే ఆర్గానిక్ ఇనార్గానిక్ లకు తోడు ఈ లవ్ కెమిస్ట్రీని కూడా యాడ్ చేస్తే కెమిస్ట్రీకి డిమాండ్ పెరుగుతుంది.. స్టూడెంట్స్ కు ఫుల్ మార్క్స్ కూడా వస్తాయి.

‘సాహో’ అనగానే మొదట్లో యాక్షన్ సినిమా అని పేరుపడిపోయింది.. కానీ ‘ఏచోట నువ్వున్నా’ లాంటి పాటలు.. ఇలాంటి రొమాంటిక్ పోస్టర్లు చూస్తుంటే రొమాన్స్ లవర్స్ కు ఫుల్ కిక్ ఖాయం అనిపిస్తోంది. ఏ విషయం ఆగష్టు 30 న మనకు తెలిసిపోతుంది లెండి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home