సాహో మరో పోస్టర్.. సూపర్ రొమాన్స్

0

సుజిత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘సాహో’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట్లో ఆగష్టు 15 న విడుదల చేయాలని అనుకున్నా.. అనివార్యకారణాల వల్ల రిలీజ్ డేట్ ను ఆగష్టు 30 కి మార్చడం జరిగింది. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ నెమ్మదిగా పికప్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘సైకో సయ్యా’ పాట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సింగిల్ రిలీజ్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు.

‘ఏ చోట నువ్వేనా ‘ అంటూ సాగే ఈ సాంగ్ టీజర్ ను మంగళవారం నాడు విడుదల చేస్తామని తెలుపుతూ ‘సాహో’ టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మంచు కొండలు ఉండే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధాతో రొమాన్స్ చేస్తున్నాడు. ప్రభాస్ వైట్ డ్రెస్ కళ్ళజోడు ధరించి స్టైలిష్ గా ఉంటే.. శ్రద్ధా రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఉంది. తన డ్రెస్ గాలికి ఎగురుతూ పోస్టర్ కు ఒక స్పెషల్ ఫీల్ తీసుకొచ్చింది. ఓవరాల్ గా పోస్టర్ సూపర్ రొమాంటిక్ గా ఉంది. ఈ పాట తెలుగు.. తమిళ.. హిందీ వెర్షన్లను రేపు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మొదటి పాట ‘సైకో సయ్యా’ బాగున్నప్పటికీ.. బాలీవుడ్ టచ్ ఉందని తెలుగు పాటలాగా లేదని కొందరు విమర్శించారు. మరి ఈ పాట ఎలా ఉంటుందో వేచి చూడాలి. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer