ప్రభాస్ – అనుష్క..ఏం చేసినా వార్తే

0

ప్రభాస్- అనుష్క అనగానే వెండితెరపై సూపర్ హిట్ పెయిర్ అని పేరు. అంతటితో స్టోరీ ఆగడం లేదు. ప్రభాస్ పెళ్ళి ఎంతకూ చేసుకోకుండా ఉండడం.. అనుష్క మ్యారేజ్ డిలే కావడంతో ప్రభాస్ – అనుష్క లవ్ గురించి ఇప్పటివరకూ ఎన్నో వార్తలు వచ్చాయి. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి అందరూ 100 మార్కులు వేస్తుండడంతో రూమర్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

రీసెంట్ గా రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి స్క్రీనింగ్..లైవ్ పెర్ఫార్మన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ టీమ్ హాజరైంది. ఈ సందర్భంగా ‘బాహుబలి’ టీమ్ ఫోటోలకు పోజులిచ్చారు. అయితే ఎక్కువ ఫోటోలలో ప్రభాస్.. అనుష్క వీలైనంత దూరంగా ఉన్నారు. పక్కపక్కనే నిలబడలేదు. దీంతో ప్రభాస్ తన లవ్ రూమర్ల పట్ల విసిగిపోయి ఇలా అనుష్కకు దూరంగా నిలుచుని ఫోటోలకు పోజిస్తున్నాడని కొత్తగా వార్తలు మొదలయ్యాయి.

ఒకవేళ ప్రభాస్ – అనుష్క పక్కనే ఉంటేనేమో ‘ఆ కెమిస్ట్రీ చూడండి.. ఆ ప్రేమ చూడండి’ అంటూ మళ్ళీ లవ్ వార్తలు వండుతారు. ఒకవేళ అలా కాకుండా దూరంగా ఉంటేనేమో ఇలా అవాయిడ్ చేస్తున్నాడని కొత్తరకమైన వార్తలు సృష్టిస్తారు. అయినా లండన్ ట్రిప్ ఫోటోలన్నిటిలో ప్రభాస్ – అనుష్క ఇలా దూరంగా నిలుచోలేదు. ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం ప్రభాస్.. అనుష్కలలో ఒకరికి మ్యారేజ్ అయ్యేదాకా ఈ వార్తలు తప్పువు.
Please Read Disclaimer