క్రియేటివిటీనే గుడ్డిగా నమ్మేస్తున్నాడా?

0

డార్లింగ్ ప్రభాస్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. బాహుబలి స్టార్ గా నేడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభాస్ పేరు మార్మోగుతోంది. అటు జపాన్ సహా విదేశాల్లో వీరాభిమానులున్నారు. మలేషియా.. చైనా.. కొరియాలోనూ డార్లింగ్ కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందుకే ఇప్పుడు అతడిపై బాధ్యత వంద రెట్లు పెరిగింది. ఎంచుకునే ప్రతి స్క్రిప్టు దర్శకుడు చాలా ఇంపార్టెంట్.

అయితే పెరిగిన క్రేజ్ తో సంబంధం లేకుండా డార్లింగ్ ఎత్తుగడలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రభాస్ ఇప్పటికీ కొత్త ట్యాలెంటునే నమ్ముతున్నాడు. నవతరం దర్శకులు ఇన్నోవేటివ్ స్క్రిప్టులతో తన వద్దకు వస్తే అవకాశం ఇచ్చేందుకు ఎంత మాత్రం వెనకాడనని ప్రామిస్ చేశాడు. పాత దర్శకులు పాత చింతకాయ స్క్రిప్టుల కంటే కొత్త దర్శకులతో కొత్త పంథా సినిమాలే చేయాలని భావిస్తున్నాడు. ప్రభాస్ వాలకం చూస్తుంటే స్క్రిప్టులో మ్యాటర్ ఉంటే చాలు.. అవకాశం ఇచ్చేందుకు వెనకాడడని అర్థమవుతోంది.

వన్ ఫిలిం వండర్స్ సుజీత్.. రాధాకృష్ణ ఇద్దరికీ అవకాశం ఇచ్చిన ప్రభాస్ .. ఇప్పటికీ కొత్త వాళ్లకే ఛాయిస్ అంటున్నాడు. అసలు జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం మంచి కథల్ని.. క్రియేటివిటీ ఉన్న దర్శకులని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. ఇది నవతరానికి వరం అనే చెప్పాలి. ఇప్పటికే ఒకరిద్దరు యువ దర్శకులు ప్రభాస్ కి కథలు చెప్పే ఆలోచనలో ఉన్నారట. అలాగే ఇప్పటికే డెబ్యూలుగా సినిమాలు తీసి నిరూపించుకున్న దర్శకులకు ప్రభాస్ వద్ద పని సులువుగానే అయ్యే అవకాశం ఉందిట. స్క్రిప్టు నచ్చాలి అంతే. అవకాశం దానంతట అదే వస్తుంది. అయితే అతడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కాబట్టి అందుకు తగ్గట్టే అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ఉపయుక్తంగా స్క్రిప్టు యూనివర్శల్ గా ఉండాలి. సేమ్ టైమ్ బడ్జెట్ అదుపు తప్పకుండా కంటెంట్ ఉండాలన్ని శరతు. రాధాకృష్ణతో జాన్ పూర్తయ్యాక మళ్లీ యువ దర్శకుడికే ఓకే చెబుతాడేమో చూడాలి.
Please Read Disclaimer