ప్రభాస్ బాలీవుడ్ కలలు కల్లలేనా..?

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో పక్కా వ్యూహంతో బాలీవుడ్ కు బాటలు వేసుకోవాలని కన్న కలలు కల్లలయినట్లేనా ? బాహుబలి తో జాతీయ స్థాయి హీరోగా మారిన ప్రభాస్ కు సాహో సినిమా చావు దెబ్బ తీసిందా ? ఎన్నో ఆశలతో సాహో సినిమా చేసి బ్లాక్ బ్లస్టర్ గా నిలిస్తే బాలీవుడ్ లో పర్మినెంట్ గా సెటిల్ అవ్వోచ్చు అనే కోరిక తీరకుండానే పోయిందా..? జక్కన్న చెక్కన శిల్పం సాహో సినిమాతో కరిగిపోయిందా ? ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ కాస్తా సాహోతో డామేజ్ అయినట్లేనా ? అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ – బాలీవుడ్ సిని విశ్లేషకులు.

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా బాహుబలి సినిమాను తెరకెక్కించాడు. బాహుబలి సినిమాను సిరిస్ గా రెండు భాగాలుగా తెరకెక్కించి టాలీవుడ్ సినిమాను బాలీవుడ్ స్థాయిలో నిలిపాడు. సౌత్ సినిమాలంటే చిన్నచూపు చూసే బాలీవుడ్ బాద్షాలకు బాహుబలి సినిమాతో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. రాజమౌళి చెక్కన బాహుబలితో ప్రభాస్ ఓవర్ నైట్ లో జాతీయస్థాయి హీరోగా మారిపోయాడు. ఇది ప్రభాస్ ఘనత అనేకన్నా జక్కన్న ఘనత అనుకోవచ్చు. అయితే బాహుబలి ఇచ్చిన స్టార్డమ్ తో ప్రభాస్ ఏకంగా హలీవుడ్ తరహాలో సినిమా తీసేందుకు రెడి అయ్యాడు…

బాహుబలి ఇచ్చిన ఇమేజ్‌తో సాహోను సినిమాను చేసిన ప్రభాస్ అనేక కలలు కన్నాడు. సాహో సినిమాతో బాలీవుడ్లో పాగా వేయాలని దక్షిణ భారత దేశం నుంచి బాలీవుడ్లో స్థిరపడిన హీరో కావాలని కన్నాడు. ప్రభాస్ ఆశయాన్ని తప్పుపట్టలేకపోయినా అతడు ఆవేశంతో రాంగ్ స్టెప్ వేసినట్టే కనిపిస్తోంది. సాహో సినిమా విడుదల అయిన తరువాత ప్రభాస్ కన్న కలలన్నీ ఒక్కసారే కల్లలయ్యాయి. దీంతో బాలీవుడ్ లో స్థిరపడాలనే ఆశ తీరకుండానే ప్రభాస్ మళ్ళీ టాలీవుడ్‌కు రాకతప్పని పరిస్థితి నెలకొంది.

అందుకే కాబోలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం ఇక కుదరకపోవచ్చు అని ప్రభాస్ అన్యాపదేశంగా అన్నాడో… సాహో సినిమా ఎట్లాగు ఫ్లాప్ అవుతుంది కాబట్టి టాలీవుడ్ కు మార్గం సుగుమం చేసుకోవాలని అన్నాడో కానీ అననైతే అన్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో స్థానం సంపాదించాలని మెగాస్టార్ చిరంజీవి అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా చేసిన సినిమాలు బాలీవుడ్లో బొల్తా కొట్టాయి.. దీంతో ఇద్దరికి బాలీవుడ్ కన్నా టాలీవుడ్ సేఫ్ అని గ్రహించారు.. ఇక ఇప్పుడు బాలీవుడ్‌కు పోదామనుకుని అందుకు తగిన విధంగా సాహో సినిమా తో మరింత బలం పుంజుకుందామనుకున్న ప్రభాస్ ఆశలు అడియాశలే అయ్యాయనే చెప్పాలి.
Please Read Disclaimer