ప్రభాస్ బాలీవుడ్ ప్రయత్నాలు?

0

ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం జాన్ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం సెట్స్ పై ఉంది. జిల్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు భాషల్లో ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ – యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 లో సినిమాని రిలీజ్ చేస్తారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21 గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది.

ప్రభాస్ కోసం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు క్యూలో ఉన్నారు. వీళ్లలో సురేందర్ రెడ్డి.. కేజీఎఫ్ ఇంద్రనీల్.. గీత గోవిందం పరశురామ్ ఫ్రంట్ రన్నర్స్ గా ఉన్నారని ప్రచారమవుతోంది. అయితే ఆ ముగ్గురిలో ప్రభాస్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారోనన్న ఉత్కంఠ ప్రభాస్ అభిమానుల్లో ఉంది.

ఈలోగానే మరో ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో వేడెక్కిస్తోంది. అదే ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ. బాహుబలి 1- బాహుబలి 2- సాహో లాంటి డబ్బింగ్ చిత్రాలతోనే ఇప్పటివరకూ హిందీ ప్రేక్షకుల్ని పలకరించిన ప్రభాస్ ఇకపై నేరుగా హిందీ సినిమాలోనే నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం. బాలీవుడ్ చిత్రం కోసం ప్రభాస్ ముంబై వెళ్లబోతున్నాడు. అక్కడ కరణ్ జోహార్ ని కలవబోతున్నాడు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే డార్లింగ్ రెడీ అంటే సినిమా చేయడానికి కరణ్ జోహార్ సహా పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ కనిపిస్తోంది.

ఇకపోతే `సైరా-నరసింహారెడ్డి` లాంటి పాన్ ఇండియా చిత్రంతో ఆకట్టుకున్న సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ ని అతడు సిద్ధం చేస్తున్నాడట. మరి ప్రభాస్ 21 ఎవరితో ఉంటుంది? సురేందర్ రెడ్డితోనా.. లేక కరణ్ జోహార్ తోనా? లేక ఇంకెవరితో అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రభాస్ బాలీవుడ్ మూవీ చేస్తే అక్కడ జాక్ పాట్ కొట్టేదెవరు? అన్నది సస్పెన్స్.
Please Read Disclaimer