నీడకు మొదటి టికెట్ కొన్న డార్లింగ్

0

రేపు విడుదల కాబోతున్న నిను వీడని నీడను నేనే డెబ్యూ పట్ల సందీప్ కిషన్ చాలా యాంగ్జైటితో ఉన్నాడు. మొదటి సినిమా అంటే నటుడిగా కాదు లెండి నిర్మాతగా. కథ దర్శకుడి మీద నమ్మకంతో తానే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడటంతో ప్రేక్షకుల్లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం యూనిట్ శుభ శకునంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నిను వీడని నీడను నేనే మొదటి టికెట్ ను సాహో ప్రభాస్ తో అమ్మకాలు మొదలుపెట్టారు.

ప్రసాద్స్ లో పడబోయే మొదటి షో 9 గంటల ఆటకు గాను డార్లింగ్ 1116 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. అందులో ఉన్న సీట్ నెంబర్ ఏ 1 స్క్రీన్ 3. అలా అని ప్రభాస్ ను కలవడం కోసం అక్కడికి వెళ్ళేరు. తన తరఫున వేరేవారిని పంపిస్తాడు కానీ అలా పబ్లిక్ లోకి డార్లింగ్ వస్తే ఏం జరుగుతోందో వేరే చెప్పాలా. పోటీ ఉన్నప్పటికీ నిను వీడని నీడను నేనే మీద సందీప్ కిషన్ చాలా ధీమాగా ఉన్నాడు.

హారర్ జానర్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీతో కార్తీక్ రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్ గా నిలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ టికెట్ కొన్నాడు కాబట్టి డార్లింగ్ ఫాన్స్ కూడా ఓ లుక్కిస్తే నీడకు ఇంకాస్త బలం దక్కినట్టే. సందీప్ కిషన్ నీడగా వెన్నెల కిషోర్ మరో కీలక పాత్ర పోషిస్తున్న నిను వీడని నీడను నేనే గత కొంత కాలంగా తగ్గిపోయిన హారర్ ట్రెండ్ కు జోష్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Please Read Disclaimer