కేసీఆర్ ఆదేశాలను ప్రభాస్ పాటిస్తున్నాడా? లేదా?

0

హైదరాబాద్ లో కరోనా చాలా స్పీడ్ గా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మార్చి 1 తర్వాత విదేశాల నుండి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఐసోలేషన్ వార్డుకు వెళ్లాల్సిందే అని అక్కడ 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉండాల్సిందే అంటూ ఆదేశించారు. విమానాశ్రంలో దిగిన ప్రతి ఒక్కరిని నేరుగా ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.

మరి ఇటీవల జార్జియా నుండి వచ్చిన ప్రభాస్ అండ్ టీం ఏం చేస్తున్నారా అంటూ చర్చ జరుగుతోంది. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో పలువురు స్వీయ నిర్భందం చేసుకుంటున్నారు. కొందరు ఐసోలేషన్ వార్డుకు వెళ్తూ ఉంటే మరికొందరు మాత్రం ఇంట్లోనే స్వీయ నిర్భందం చేసుకుంటున్నారు. పలువురు స్టార్స్ స్వీయ నిర్భందం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ మాత్రం స్వీయ నిర్భందంలో ఉన్నాడా లేదంటే కుటుంబ సభ్యులతో మునుపటిలా ఉన్నాడా అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఆయన తప్పనిసరిగా స్వీయ నిర్భందలోకి వెళ్లాలని లేదంటే ముందస్తు జాగ్రత్త కోసం ఐసోలేషన్ వార్డు లో రెండు వారాలు ఉండాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ ప్రమాదకర స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దంటూ నిపుణులు సూచిస్తున్నారు. కనుక ప్రభాస్ ఛాన్స్ తీసుకోకుండా ఉండటం మంచిదంటూ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-