‘సాహో’ కి సీక్వెల్ ఉంటుందా..?

0

తెలుగు రాష్ట్రాల అభిమానులతో పాటు – బాలీవుడ్ – కోలీవుడ్ – శాండిల్ వుడ్ – మల్లూవుడ్ లకు చెందిన సినీ ప్రేక్షకుల ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది యంగ్ రెబల్ స్టార్ నటించిన ‘సాహో’నే. హాలీవుడ్ రేంజ్ లో అతి పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సాహో చిత్రం ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు శ్రద్ధాకపూర్ – నీల్ నితిన్ ముకేష్ నటించగా – జీబ్రాన్ సంగీతం అందించారు.

అయితే ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిన సాహో చిత్రానికి సీక్వెల్ వస్తుందా అంటే ? ప్రభాస్ అవుననే చెబుతున్నాడు. ఈ చిత్రం విడుదల సందర్భంగా డార్లింగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సాహో సీక్వెల్ గురించి మాట్లాడాడు. సాహో బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే సాహో 2 ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ…అవకాశాలు ఉన్నాయని ప్రభాస్ గట్టిగా చెప్పాడు.

అలాగే బాహుబలి 3 కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయని చెప్పాడు. రాజమౌళి అనుకున్న కథలో కేవలం 60 శాతం మాత్రమే బాహుబలి 1 – 2లలో చూపించారని బాహుబలి 3 అనేది ఉంటే మిగిలిన కథతో తెరకెక్కే ఛాన్స్ ఉందన్నాడు. అయితే ఈ సినిమాపై నిర్ణయం రాజమౌళీదే అని కూడా ప్రభాస్ చెప్పాడు. ఇక అలాగే కొన్ని ప్రశ్నలకు ప్రభాస్ సమాధానమిస్తూ.. అనుష్క అందంగా ఉంటుందని కానీ అప్పుడప్పుడు ఫోన్లు లిఫ్ట్ చేయదని చెప్పాడు.

బాలీవుడ్ లో ఫేవరెట్ హీరోలు సల్మాన్ – షారూక్ ఖాన్ అని చెప్పగా – సౌత్ లో చిరంజీవి – రజనీకాంత్ అని చెప్పాడు. అలాగే తను ఎక్కువ కూల్ గా ఉండటానికి రాజమౌళినే కారణమని అన్నాడు. అదేవిధంగా ఏదైనా సినిమా తీయాలంటే కథకు ఎక్కువ విలువ ఇస్తానని ఆ తర్వాత ఫ్యాన్స్ కు నచ్చుతుందా లేదా ? అనేది చూస్తానని ఫ్యాన్స్ మధ్యలో కాకుండా ప్రత్యేకంగా సినిమా చూస్తే బోరు కొడుతుందని చెప్పాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home