హీరోయిన్ చీరకొంగు పట్టుకుని ప్రభాస్ చిలిపి డాన్స్

0

ప్రభాస్ చాలా మొహమాటస్తుడని.. అమ్మాయిల విషయంలో చాలా సిగ్గు పడతాడనే టాక్ ఉంది. తన అనుకున్న వారితో అత్యంత ఆప్యాయంగా ఉండే ప్రభాస్ అమ్మాయిల విషయంలో అత్తిపత్తి తరహాలో ఉంటాడని కొందరు కామెడీ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ తో సినిమాలో రొమాంటిక్ సీన్స్ షూట్ సమయంలో కూడా ప్రభాస్ బాగా మొహమాట పడటంతో పాటు సిగ్గు పడతాడని ఆయనతో వర్క్ చేసిన కొందరు గతంలో చెప్పారు. కాని ఇప్పుడు తన మొహమాటం సిగ్గులను పక్కకు పెట్టినట్లుగా సాహో ప్రమోషన్స్ లో ఆయన జోరు చూస్తుంటే అనిపిస్తుంది.

గతంలో ఇంటర్వ్యూలైతే ఇచ్చేవాడు కాని ఎక్కువగా స్టేజ్ షోలకు వెళ్లడం సరదా చిట్ చాట్ లు చేయడం తక్కువగా కనిపించేది. కాని తాజాగా సాహో ఉత్తరాదిన భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్న ప్రభాస్ స్టేజ్ లపై డాన్స్ లు చేయడం.. సరదాగా చిలిపి పనులు చేయడం కూడా చేస్తున్నాడు. సాహో ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నిర్మాణంలో ప్రసారం అవుతున్న నచ్ బలియే 9 డాన్స్ షో లో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సల్మాన్ నటించిన ‘కిక్’ సినిమాలోని జుమ్మేకీ రాత్ హై… పాటకు నచ్ బలియే జడ్జ్ అయిన రవీనా టాండన్ తో ప్రభాస్ మరియు శ్రద్దాలు డాన్స్ చేశారు. ఆ సమయంలోనే రవీనా టాండన్ చీర కొంగును నోట్లో పెట్టుకుని సరదాగా ప్రభాస్ చేసిన స్టెప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నచ్ బలియే డాన్స్ షో లో సాహో ప్రమోషన్స్ తో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఉత్తరాదిన భారీ వసూళ్లపై కన్నేసిన ‘సాహో’ టీం ప్రమోషన్స్ లో దుమ్ము దులిపేస్తున్నారు.
Please Read Disclaimer