ఆమిర్ ఖాన్ ఫోన్ చేసి పిలిచారు

0

‘బాహుబలి’ తో ఇండియన్ సినిమా స్టామినా ఏంటో నిరూపించి టాలీవుడ్ హీరోలకే కాదు బాలీవుడ్ హీరోలకు సైతం టార్గెట్ ఫిక్స్ చేసాడు ప్రభాస్. రాజమౌళి -ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ బాలీవుడ్ హీరోలకు పెద్ద సావాలే విసిరాయి. ఈ సినిమాలతో ఒక్కసారిగా ఖాన్ లను దాటేసాడు ప్రభాస్. అయితే ఈ మధ్య ప్రభాస్ కి మీడియాలో కూడా ఎక్కువగా ఇదే ప్రశ్న ఎదురవుతుంది.

లేటెస్ట్ గా ప్రభాస్ కి తెలుగులో కూడా మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది. ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ కు ఖాన్ లను దాటేసారుగా వాళ్ళతో మీ రిలేషన్ షిప్ ఎలా ఉంది.. ఎవరైనా టచ్ లో ఉన్నారా.. అనే ప్రశ్న విసిరారు. అయితే దానికి తడబడకుండా ఓ మూడు పేర్లు చెప్పి వాళ్ళ గురించి తన రిలేషన్ చెప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్.

రణబీర్ కపూర్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడని – అతను బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసని – నా ప్రతీ సినిమాకు రణబీర్ ఫోన్ చేసి మరీ మాట్లాడతాడని తెలిపాడు. అలాగే అజయ్ దేవగన్ గారు కూడా నాతో బాగా క్లోజ్ గా ఉంటారని – ఈ మధ్య ఓ మూడు నెలల క్రితం ఆమిర్ ఖాన్ గారు కూడా ఫోన్ చేసి ఓ సినిమా ప్రీమియర్ కి పిలిచారని చెప్పుకొచ్చాడు ప్రభాస్. సో ఈ ముగ్గురే కాదు ప్రభాస్ తో ఇప్పుడు మిగతా బాలీవుడ్ హీరోలు కూడా టచ్ లో ఉన్నారట. కాకపోతే మీడియా ముందు మాత్రం ఈ ముగ్గురి పేర్లే చెప్పాడు బాహుబలి. మరో బాహుబలితో నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి యూనివర్సల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సాహో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెల్తాడేమో చూడాలి.
Please Read Disclaimer