ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ చేసిన మాయ ఇదీ

0

ప్రభాస్..యంగ్ రెబల్ స్టార్.. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు ‘సాహో’ సినిమాతో ఈ నెల 30న మరోసారి దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి వస్తున్నాడు. అయితే తెలుగు నాట ప్రభాస్ అంటే అందరికీ తెలుసు.. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి హిందీలో ఫ్యాన్స్ సంగతేంటి? ఉత్తరాది వారికి ప్రభాస్ పై ఎంత ప్రేమ ఉంది..

తాజాగా ఒడిషాకు చెందిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ సుమిత్ ద్వివేది ప్రభాస్ పై ప్రేమను అద్భుతంగా చూపించాడు. అతడు ప్రభాస్ కోసం ఏకంగా 486 రుబిక్స్ క్యూబ్ లను సేకరించి 13 గంటలు కష్టపడి ప్రభాస్ ముఖం కనిపించేలా వరుసగా గోడకు పేర్చాడు.

ప్రభాస్ సాహో చిత్రం రిలీజ్ సందర్భంగా అతడిపై ప్రేమతో సాహో లుక్ ను రుబిక్స్ క్యూబ్ తో ఇలా తీర్చిదిద్దాడు. ఒడిషాలోని కియోంజర్ కు చెందిన సుబిత్ తాజాగా ప్రభాస్ కోసం చేసిన ఈ ఫీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభాస్ కు తెలుగు నాటే కాదు.. ఒడిషాలో కూడా ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం ఈ వీడియోతో తేటతెల్లమైంది.
Please Read Disclaimer