ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫూల్స్ చేసిన ఫేక్ న్యూస్…

0

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అతి త్వరలో విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు రాధాకృష్ణ ప్రకటించాడు. మరోవైపు ప్రభాస్ ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి టైటిల్ ని ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తారని వైజయంతీ మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుండి న్యూస్ వచ్చింది. తమ అభిమాన హీరో రెండు సినిమాలకు సంబందించిన అప్డేట్ ఉగాది పండగ సందర్భంగా వస్తుండటంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ 21వ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఫేక్ అని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే ట్విట్టర్ లో వైజయంతి మూవీస్ పేరుతో ఉన్న అకౌంట్ ఆఫీసియల్ అకౌంట్ కాదని వాళ్ళు స్ప్రెడ్ చేసిన న్యూస్ అని తెలుస్తుంది. వీళ్ళు అదే పనిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటారని సమాచారం. ఇంతకముందు కూడా ఇదే ట్విట్టర్ అకౌంట్ నుండి ఎన్టీఆర్ అశ్వినీదత్ కలిసి బాహుబలి స్థాయి ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారంటూ న్యూస్ బయటకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త ఫేక్ అని చాలా రోజులకి అర్ధం అయింది. వాస్తవానికి ఆ ట్విట్టర్ అకౌంట్ చూసిన వాళ్ళు నిజమైనదే అని భావిస్తారు. అయితే ట్విట్టర్ ఆ అకౌంట్ ని వెరిఫై చేయలేదని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ దిగాలుపడిపోయారు. దీంతో ఇతర హీరోల అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ ఫూల్స్ అయ్యారని నవ్వుకుంటున్నారంట. ఫేక్ న్యూస్ వల్ల ఫూల్స్ అయిన అభిమానులను ప్రభాస్ ఆ వార్త నిజం చేసి ఆనందపరుస్తాడేమో చూడాలి మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-