ప్రభాస్ ఫాన్స్ అసహనం

0

ఏ హీరో అభిమానులైనా తమ హీరో పుట్టిన రోజు నాడు అభిమాన హీరో అప్ కమింగ్ సినిమా నుండి పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ ఉంటుందని ఊహిస్తారు. ఆ రిలీజయిన పోస్టర్ తో కటౌట్ లు కట్టుకొని మురిసిపోతుంటారు. ఇది సహజమే. అయితే అలా తమ అభిమాన హీరో పోస్టర్ వస్తుందని ఊహించిన అభిమానులకు మేకర్స్ నుండి అప్డేట్ అందకపోతే ఇక అంతే సంగతులు.

సరిగ్గా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి అదే. రేపు ప్రభాస్ పుట్టినరోజు. ఈ రోజు ‘జాన్’ సినిమాకు సంబంధించి రిలీజయ్యే పోస్టర్ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఉదయం నుండే సోషల్ మీడియాలో కాసుకొని కూర్చున్నారు రెబల్ ఫ్యాన్స్. అయితే ఎన్ని గంటలు గడించినా అప్డేట్ రాకపోవడంతో ప్రొడక్షన్ హౌజ్ ను మరోసారి టార్గెట్ చేస్తూ అప్డేట్ ఇవ్వాలంటూ పోస్టులు వేస్తున్నారు.

నిజానికి రేపు ‘జాన్’ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుందనే సమాచారం ఫ్యాన్స్ కి అందింది. కానీ యూవీ క్రియేషన్స్ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కొంత అసహనానికి గురయ్యారావుతున్నారంతే.
Please Read Disclaimer