ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపడేలా చేసిన ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ ట్వీట్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజాహెగ్డే హీరో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేశారు. ప్రభాస్ మరియు పూజాహెగ్డేల గ్రాండియర్ లుక్ వావ్ అనిపించేలా ఉంది. ఫస్ట్ లుక్ లోనే రొమాంటిక్ మూడ్ లో ఉన్న ప్రభాస్ – పూజాహెగ్డేల స్టిల్ ను విడుదల చేయడంతో ఇదో ఫ్యూర్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభించడంతో అభిమానులు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఓ వర్గం ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కొత్త డౌట్స్ క్రియేట్ అవుతున్నాయట.

‘రాధే శ్యామ్’ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ నిన్న సోషల్ మీడియా వేదికగా ”ఉన్నంత కాలం భూమి ఆకాశం.. నిలిచేటి గాదే ఈ రాధే శ్యామ్” అని నాలుగు భాషల్లో ట్వీట్ చేసారు. దీంతో ఇది పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సెన్సిబుల్ లవ్ డ్రామా అని సినీ అభిమానులు ఒక ఐడియాకి వచ్చేసారు. ఫస్ట్ లుక్ కూడా చాలా క్లాసిక్ గా డిజైన్ చేయబడింది. మరి ‘రాధే శ్యామ్’ లవ్ క్లాసిక్ అయితే ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఆశించే భారీ ఫైట్స్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయా లేదా అనే సందేహం వారిని వెంటాడుతోందట. అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే ప్రభాస్ పాన్ ఇండియా సినిమా వర్కౌట్ అవుద్దా అనే ఆలోచన చేస్తున్నారట. అయితే కొంతమంది మాత్రం ‘రాధే శ్యామ్’ లవ్ బ్యాగ్రౌండ్ లో ఉండే యాక్షన్ డ్రామా అయ్యుండొచ్చు.. చరిత్రలో యుద్ధాలన్నీ ప్రేమ కోసమే జరిగాయనే కోణంలో ఈ సినిమా ఉంటుందని ఎక్ష్పెక్త్ చేస్తున్నారట. యంగ్ రెబల్ స్టార్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఎలా ఉంటుంది.. వాటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదని కామెంట్స్ చేస్తున్నారు.