ప్రభాస్ టెన్షన్ లో న్యాయముంది!

0

సంవత్సరాలు నెలలయ్యాయి. నెలలు రోజులయ్యాయి. ఇప్పుడు రోజులు గంటల్లోకి మారబోతున్నాయి. సాహో విషయంలో అభిమానులకు ఇవి తప్ప ఇంకేదీ పట్టడం లేదు. రెండేళ్ల గ్యాప్ తో బాహుబలి లాంటి అద్భుతాన్ని చూశాక తమ హీరో చేస్తున్న సినిమా కాబట్టి వాళ్ళ అంచనాలు ఆశల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ సైతం కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోషన్ కోసం ఎడతెరిపి లేకుండా ఈవెంట్లు ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు టాక్ షోలంటూ ఉక్కిరి బిక్కిరి అయ్యే రేంజ్ లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.

ఫైనల్ అవుట్ ఫుట్ మీద రిజల్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ తనలో సాహో తాలూకు టెన్షన్ ఉందని ఒప్పేసుకుంటున్నాడు డార్లింగ్. ఒకరకమైన వేదాంతధోరణి కూడా అందులో కనిపించడం విశేషం. ఏదో ఒక దశలో ప్రతిఒక్కరికి ఫెయిల్యూర్ అనేది వేచి ఉంటుందని అది ముందే ఊహించడం కష్టం కాబట్టి దాన్ని అంగీకరించే స్థితప్రజ్ఞత ఉండాలని చెప్పాడు. అయితే సాహో విషయంలో తాను పూర్తి నమ్మకంతో ఉన్నానని కాకపోతే వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన తన మిత్రులను తలచుకుంటేనే కొంచెం భయంతో కూడిన టెన్షన్ కలుగుతోందట.

ఇంతమంది టెక్నీషియన్ల కష్టం వృధా కాకూడదని నిత్యం కోరుకుంటానని చెప్పాడు. నిజంగా డార్లింగ్ మాటల్లో చాలా అర్థం పరిణితి ఉంది. ఏ మాత్రం అటుఇటు అయినా నిర్మాతల డబ్బు కర్పూరమయ్యే ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్స్ లో వాళ్ళ క్షేమం కోరి హీరో ఇలా ఆలోచించడం చూస్తే స్క్రీన్ మీదే కాదు డార్లింగ్ రియల్ లైఫ్ లో కూడా జెంటిల్ మెన్ అని మురిసిపోతున్నారు అభిమానులు
Please Read Disclaimer