ఏంటి డార్లింగ్? అది అదే ఇది ఇదేనా!

0

డార్లింగ్ ప్రభాస్ లోని సిగ్గరి గురించి.. మొహమాటస్తుడి గురించి తెలిసిందే. పబ్లిక్ వేదికలపై మాట్లాడాలన్నా.. లేదా పది మందితో ఇట్టే వెంటనే కలిసిపోవాలన్నా డార్లింగ్ కాస్తంత సిగ్గుగానే ఫీలవుతుంటారు. ఆ సంగతి అభిమానులందరికీ తెలుసు. ఇలా అయితే పెద్ద తెరపై అంత గొప్పగా ఎలా జీవించేస్తున్నావ్ డార్లింగ్ ? అని ప్రశ్నించనక్కర్లేదు. అది అదే.. ఇది ఇదే!

ఇక ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారి సిగ్గు విడిచి చేసిన బుల్లితెర షోగా `కాఫీ విత్ కరణ్ షో` పాపులరైంది. మన తెలుగు కుర్రాడు అమరేంద్ర బాహుబలి సిగ్గు వ్యవహారం గురించి ఉత్తరాది అభిమానులందరికీ తెలిసిపోయింది. అక్కడా రాజమౌళి పక్కనే కూచుని ఉండగా సిగ్గును కవర్ చేసేస్తూ.. కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ప్రభాస్. మొదటి సారి బుల్లితెర షో! అంటూ చాలానే బిడియపడ్డాడు. అదంతా సరే కానీ ఆ షో మహిహ ఏమిటో కానీ.. ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ కోసం అన్ని మీడియాల్ని చుట్టేస్తున్న డార్లింగ్ లో కొంత సిగ్గు తగ్గినట్టే కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఓ బుల్లితెర షోలో రవీనాటాండన్ చీరకొంగును నోట కరిచి పట్టుకుని ప్రభాస్ వేసిన స్టెప్పులకు జనం ఖంగు తిన్నారు. ఏమిటీ ఇది మన డార్లింగేనా? అంటూ కంగారు పడ్డారు.

హిందీ బుల్లితెరకు ఎంతో పాపులర్ షోలుగా చెప్పుకునే నాచ్ భలియే.. ది కపిల్ శర్మ షోల్లోనూ డార్లింగ్ ప్రభాస్ మెరిశాడు. అక్కడ డార్లింగ్ అప్పియరెన్స్ తో టీవీ షోలకు టీఆర్పీలు స్కైని టచ్ చేసి ఉంటాయన్న అంచనా వెలువడింది. `టిప్ టిప్ బర్సా పానీ` అంటూ నాచ్ బలియే షోలో రవీనాతో కలిసి ప్రభాస్ వేసిన స్టెప్పుల్ని జనాలు మర్చిపోలేదింకా. ఈలోగానే కపిల్ శర్మ బుల్లితెర రియాలిటీ షోలోనూ ప్రభాస్ ఫీట్స్ కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అంత రిజర్వ్ డ్ గా ఉండే కుర్రాడేనా? ఇంతగా ఓపెన్ అయ్యాడు! అంటూ జాతీయ స్థాయిలో అభిమానుల్లో డిబేట్ రన్ అవుతోందిప్పుడు. ఇదంతా ఫ్రెండ్స్ కోసం. ఫ్రెండ్స్ తనని నమ్మి 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఆ నమ్మకాన్ని గెలిపించేందుకు.. `సాహో` చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలన్న ప్రయత్నం ఇదని భావించాలి. సిగ్గు బిడియం జానే దో.. అంటూ ప్రభాస్ చెలరేగుతున్న తీరు ఫ్యాన్స్ ని మైమరిపిస్తోంది. ఈ జోరు ఇలాగే సాగనీ డార్లింగ్ అంటూ ఉత్తరాది ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.
Please Read Disclaimer