‘కే. జీ.ఎఫ్’ డైరెక్టర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

0

గతేడాది వచ్చిన ‘కే. జీ.ఎఫ్’ అనే కన్నడ సినిమా టాలీవుడ్ లో ఎవరూ ఊహించని విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాలో హీరో తాలూకు ఎలివేషన్ సీన్స్ కి మాస్ ఆడియన్స్ మంత్రముగ్దులయ్యారు. ఆ చూసినప్పటి నుండి ఆ సినిమా దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేయబోతున్నాడంటూ ఊహా గానాలు కూడా మోదలెట్టారు. ఈ లిస్టులో ప్రభాస్ – ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి.

ప్రశాంత్ నీల్ తో ఎన్ఠీఆర్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ప్రభాస్ తో సినిమా ఉంటుందా.. లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ విషయంపై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేసాడు ప్రభాస్. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూ లో కేజీఎఫ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారా..? అని అడగ్గా అలాంటిదేమి లేదని – తమ మధ్య అసలు డిస్కర్షన్స్ లేదని తేల్చేశాడు. ప్రభాస్ మాటలతో ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండదనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం మళ్లీ యశ్ తోనే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తీస్తున్నాడు ప్రశాంత్. ఛాప్టర్ 1 కి వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాకు బడ్జెట్ కూడా పెంచారు.ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్ఠీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా చేయనున్నాడు ప్రశాంత్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు అప్డేట్ రానుంది.
Please Read Disclaimer