ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్.. యమా కాస్ట్లీ!

0

ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ మరో నెలలో రిలీజ్ కానుంది. దీంతో అందరూ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు ప్రభాస్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ‘సాహో’ ప్రభాస్ రెమ్యూనరేషన్ ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుసుకుందాం.

‘సాహో’ లో ప్రభాస్ హయిర్ స్టైల్ కు మంచి అప్లాజ్ వచ్చింది. కొన్ని పోస్టర్లలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా బాలీవుడ్ హీరో తరహాలో కనిపిస్తున్నాడంటే అందుకు హెయిర్ స్టైల్ కూడా ఒక కారణం. మరి ప్రభాస్ హెయిర్ స్టైలింగ్ చేసినవారు ఎవరో తెలుసా? ఇండియాలోనే ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. ప్రభాస్ కు ఈ సినిమా కోసమే కాదు.. ‘మిర్చి’ సినిమా చేసిన సమయం నుండి ఆయనే హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారట. ఈయన ఒకసారి హెయిర్ కట్ చేస్తే రూ. 4 నుండి 10 లక్షల వరకూ ఛార్జ్ చేస్తారట. రొంబ కాస్ట్ లీ కదా?

మరి ఆయన రేంజ్ అది. బాలీవుడ్ లో పలువురు సూపర్ స్టార్లకు హెయిర్ స్టైలిస్టు ఆలిమ్ హకీమ్. ఆ రేంజ్ ఫీజు ఛార్జ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి. ప్రభాస్ కు స్టైలింగ్ చేయడం అంటే సింపుల్ కాదు. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ కదా.. ఆ స్టార్ డమ్ కు తగ్గట్టే అన్నీ మెయింటెయిన్ చెయ్యాలి కదా. హిందీ ప్రేక్షకులు కూడా ప్రభాస్.. ప్రభాస్ అని కలవరిస్తున్నారంటే దాని వెనక ప్రభాస్ నటన.. హార్డ్ వర్క్ తో పాటుగా ఎన్నో అంశాలు ఉంటాయి. ముఖ్యంగా స్టైలింగ్ వెనక ఇంత కథ ఉంటుంది.
Please Read Disclaimer